Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో ఆన్‌లొకేషన్‌ పిక్ వైరల్‌

సినిమా షూటింగ్‌ పూర్తి అయిన సందర్భంగా అజిత్ స్టైలిష్ లుక్‌ లో కనిపిస్తున్న ఫోటోను షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   15 Dec 2024 8:29 AM GMT
స్టార్‌ హీరో ఆన్‌లొకేషన్‌ పిక్ వైరల్‌
X

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ ప్రస్తుతం అధిక్‌ రవిచందర్‌ దర్శకత్వంలో 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను అధిక్‌ రవిచందర్‌ రూపొందిస్తున్నారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ను తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌తో చేయిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సినిమా సంగీతం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అజిత్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో ఆయన నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. కానీ ఈమధ్య కాలంలో ఆయన తెలుగులో ఆకట్టుకోలేక పోతున్నాడు. అయినా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తంలో ఖర్చు చేసి నిర్మిస్తున్నారు అంటూ సమాచారం అందుతోంది. తెలుగులో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని భావించి మైత్రి మూవీ మేకర్స్ వారు వెనక్కి తగ్గారు.

సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమాను సమ్మర్‌కి వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యామని పుష్ప 2 సినిమా ప్రమోషన్‌ సమయంలో చెప్పుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ఒక మంచి విడుదల తేదీని చూసి రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ వారు ఇటీవల అజిత్‌ ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా షూటింగ్‌ పూర్తి అయిన సందర్భంగా అజిత్ స్టైలిష్ లుక్‌ లో కనిపిస్తున్న ఫోటోను షేర్ చేశారు.

ఈ ఫోటోలో అజిత్‌ వయసు పది నుంచి పదిహేను ఏళ్లు తగ్గినట్లు అనిపిస్తుందని, ఇదే లుక్‌లో అజిత్ మొత్తం సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరు పిదా కావడం ఖాయం అంటూ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ అజిత్ లుక్‌ను చూస్తే అనిపిస్తుంది. త్వరలోనే సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాలని మైత్రి మూవీ మేకర్స్‌ను అజిత్‌ ఫ్యాన్స్ కోరుతున్నారు. సమ్మర్‌లో అజిత్ సినిమా విడుదల ఉంటుందేమో చూడాలి.