Begin typing your search above and press return to search.

త‌ల పండినా కానీ త‌ళా లుక్కే వేరబ్బా!

సరికొత్త పోస్టర్‌ను అజిత్ కుమార్ మేనేజర్ సురేష్ చంద్ర తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయ‌గా అజిత్ ఫ్యాన్స్ లో ఉన్మాదం మొద‌లైంది.

By:  Tupaki Desk   |   1 July 2024 2:50 PM GMT
త‌ల పండినా కానీ త‌ళా లుక్కే వేరబ్బా!
X

'విడాముయార్చి'తో త‌ళా అజిత్ గ్రేట్ కంబ్యాక్ కోసం చూస్తున్నాడు. 2024లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ చిత్రమిది. విడుదలకు ప్ర‌చారంలో భాగంగా.. మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ పోస్టర్ ఆన్‌లైన్‌లో విపరీతంగా ఆకట్టుకుంటోంది.

యాక్షన్ సర్వైవల్ డ్రామా క‌థ‌తో రూపొందుతున్న 'విదాముయార్చి'లో అజిత్ కుమార్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తారు. ఈ ఆదివారం మేకర్స్ ఎట్టకేలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేయగా వెబ్ లో క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. ఇది అసహనానికి గురైన అభిమానుల్లో క‌ల్లోలంగా మారింది. సరికొత్త పోస్టర్‌ను అజిత్ కుమార్ మేనేజర్ సురేష్ చంద్ర తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయ‌గా అజిత్ ఫ్యాన్స్ లో ఉన్మాదం మొద‌లైంది.

పట్టుదలతో కూడిన యువ‌కుడి కథను తెర‌పై చూడాలంటే.. ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి! అనే అద్భుత‌మైన థీమ్ లైన్ ని టీమ్ ప్ర‌చారం చేస్తోంది. చుట్టూ ఎడారి.. మ‌ధ్య‌లో న‌ల్ల‌ని తాచు లాంటి రోడ్.. ఆ రోడ్ పై త‌ళా అజిత్ బ్లాక్ బ్యాగ్ తీసుకుని స్టైలిష్ గా వ‌స్తున్నాడు. త‌ళా ఒక‌ పొడవైన ఖాళీ రహదారి మధ్యలో క‌నిపిస్తున్నాడు. పోస్ట‌ర్ ర‌క్తి క‌ట్టిస్తోంది. అజిత్ న‌లుపు రంగు దుస్తులు ధరించి, డఫిల్ బ్యాగ్‌తో వ‌స్తుంటే డాన్ లా క‌నిపిస్తున్నాడు. పండు వెంట్రుక‌ల‌కు త‌గ్గ‌ట్టు, బ్లాక్‌ షేడ్స్ ధ‌రించి త‌ళా త‌న‌దైన లుక్ తో గుబులు పుట్టించాడు. ఈ పోస్ట‌ర్ పై అభిమానులు విరుచుకుప‌డుతున్నారు. మార్గంలో వాతియార్ అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, రెండవ అభిమాని ''హైప్ నిజమైనది. బెస్ట్ అండ్ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ ఎవర్'' అని రాసారు. ఎక్కువగా ఎదురుచూస్తున్న #VidaaMuyarchi ఫస్ట్ లుక్ అని చాలామంది ఫ్యాన్స్ వ్యాఖ్య‌ను జోడించారు. త‌ల పండినా కానీ త‌ళా లెవ‌లే వేరబ్బా! అంటూ ఒక తెలుగు అభిమాని వ్యాఖ్యానించారు. ఈ లుక్ వేలాది లైక్‌లు.. 4.9 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది.

విదాముయార్చికి రచయిత కూడా అయిన మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, త్రిష, రెజీనా కసాండ్రా, ఆరవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.