Begin typing your search above and press return to search.

అజిత్ సినిమా.. బిజినెస్ జరగలేదా?

కోలీవుడ్ లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు అజిత్

By:  Tupaki Desk   |   8 July 2024 5:53 AM GMT
అజిత్ సినిమా.. బిజినెస్ జరగలేదా?
X

కోలీవుడ్ లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు అజిత్. తెలుగు సినిమాలతోనే హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన అజిత్ తరువాత కోలీవుడ్ కమర్షియల్ హీరోగా ఎదిగాడు. ఆరంభంలో ప్రేమకథలు చేసిన అజిత్ తర్వాత యాక్షన్ బ్యాక్ స్టోరీస్ వైపు దృష్టిపెట్టాడు. తన స్టైల్, లుక్స్ మార్చుకొని హీరో అంటే యంగ్ గా కనిపించాలనే రూల్ ని బ్రేక్ చేశాడు. ఆరంభం మూవీ నుంచి అజిత్ తన సినిమాల ఎంపిక పూర్తిగా మార్చేశాడు.

ఎక్కువగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కోలీవుడ్ ప్రేక్షకులు కూడా అజిత్ కి వరుస సక్సెస్ లు అందిస్తూ వచ్చారు. అయితే అతనికి కోలీవుడ్ లో వరుస విజయాలు వస్తోన్న తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో మార్కెట్ క్రియేట్ కాలేదు. అతని తోటి యాక్టర్స్ అయిన దళపతి విజయ్, సూర్య, విక్రమ్, లాంటి స్టార్స్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది.

విజయ్ చాలా ఆలస్యంగా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన వరుస సక్సెస్ లు అందుకోవడంతో మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో చేసిన వారసుడు మూవీతో తెలుగు ఆడియన్స్ కి విజయ్ ఇంకా చేరువ అయ్యాడు. ప్రస్తుతం ఆయన చేస్తోన్న GOAT మూవీపైన తెలుగులో మంచి హైప్ ఉంది. ఈ సినిమా రైట్స్ కూడా సాలిడ్ ధరకి తెలుగులో అమ్ముడైపోయాయి. అజిత్ ప్రస్తుతం విడామయార్చి సినిమాని లైకా ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు.

మోగేజ్ తిరుమణి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో విడామయార్చి సినిమా బిజినెస్ ఇంకా కంప్లీట్ కాలేదంట. దీనికి కారణం అజిత్ సినిమాలకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడం ఒకటిగా కనిపిస్తోంది. అలాగే లైకా ప్రొడక్షన్స్ లో వచ్చిన లాల్ సలామ్ మూవీ తెలుగు రైట్స్ తీసుకొని చాలా మంది లాస్ అయ్యారు. వాటికి సంబందించిన సెటిల్మెంట్స్ ఇంకా చేయలేదంట.

జులై 12న రిలీజ్ అవుతోన్న కమల్ హాసన్ మూవీ భారతీయుడు 2ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ మూవీ రిజల్ట్ తర్వాత విడా మయార్చి బిజినెస్ డీల్స్ పై డిస్కస్ చేయాలని అనుకుంటున్నారంట. అజిత్ కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటున్న తెలుగు మార్కెట్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే గతంలో అతని సినిమాలకి వచ్చిన ఆదరణ బట్టి తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో హిట్ అయిన సినిమాలు కూడా తెలుగులో కమర్షియల్ ఫెయిల్ అవుతున్నాయి. ఈ కారణాల వలన విడామయార్చి మూవీకి తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ జరగలేదని టాక్.