మరే స్టార్ హీరోకి ఐనా ఇది సాధ్యమా?
అలాంటిది తమిళ స్టార్ హీరో అజిత్ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాడు.
By: Tupaki Desk | 5 April 2024 11:30 AM GMTరెండు దశాబ్దాల క్రితం వరకు స్టార్ హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా గొప్ప విషయం అయ్యింది. ఒక్క సినిమా సినిమాకు ఏళ్లకు ఏళ్లు తీసుకుంటున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు.
అలాంటిది రెండు నెలల గ్యాప్ లో ఏకంగా రెండు సినిమాలతో ఒక హీరో రావడం అనేది ఈ మధ్య కాలంలో దాదాపు అసాధ్యం అయ్యింది. అదే స్టార్ హీరో రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలతో రావడం అనేది ఏ హీరోకి సాధ్యం కాదు అని అంతా అనుకుంటూ ఉంటారు. అలాంటిది తమిళ స్టార్ హీరో అజిత్ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాడు.
ప్రస్తుతం అజిత్ నటిస్తున్న విడా ముయర్చి సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విడా ముయర్చి సినిమా కోసం అజిత్ చేసిన ఒక రిస్కీ స్టంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. అజిత్ కాకుండా మరే హీరో అయినా ఇలాంటి రిస్కీ సీన్స్ చేస్తాడా అంటూ ఆయన ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.
అక్టోబర్ లో రిలీజ్ అవ్వబోతున్న విడా ముయర్చి సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అజిత్ సినిమా ఒకటి రూపొందుతోంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ను 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
అజిత్ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులకు ఫుల్ మీల్స్ ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటూ ఉన్నారు. రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలతో రావడం అనేది మరే హీరోకి సాధ్యం కాకపోవచ్చు.