Begin typing your search above and press return to search.

కంగువ సీక్వెన్స్.. థ్రిల్ అయిన స్టార్ హీరో

ఈ నేపథ్యంలో అజిత్ తో ఉన్న బాండింగ్ కొద్ది దర్శకుడు శివ కంగువ సీన్స్ ని చూపించాడంట. ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్ లో ఈ టాక్ గట్టిగా నడుస్తోంది.

By:  Tupaki Desk   |   26 May 2024 9:30 AM GMT
కంగువ సీక్వెన్స్.. థ్రిల్ అయిన స్టార్ హీరో
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాలు దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ కంగువ. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని 300+ కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రంగా హై ఎక్స్ పెక్టేషన్స్ తో కంగువ రానుంది.

ఇప్పటికే కంగువ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకొంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ జోనర్ లో కంగువ మూవీ కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. మూవీలో సూర్య రెండు భిన్నమైన పాత్రలలో రెండు టైం లైన్స్ లలో కనిపించబోతున్నాడు. అందులో ఒక క్యారెక్టర్ లో ట్రైబల్ వారియర్ గా ప్రేక్షకులని ఎగ్జైట్ చేయబోతున్నాడు. ఈ క్యారెక్టర్ పైనే టీజర్ ని కూడా దర్శకుడు శివ కట్ చేసి రిలీజ్ చేశారు.

దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి నెక్స్ట్ లెవల్ హైప్ తీసుకొచ్చేలా ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబందించిన కొన్ని సీన్స్ ని స్టార్ హీరో అజిత్ చూశారంట. ఆ సీన్స్ చూసిన అజిత్ థ్రిల్ గా ఫీల్ అయ్యి దర్శకుడు శివని ప్రశంసించారంట. అజిత్, శివ కాంబినేషన్ లో కోలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అజిత్ తో ఉన్న బాండింగ్ కొద్ది దర్శకుడు శివ కంగువ సీన్స్ ని చూపించాడంట. ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్ లో ఈ టాక్ గట్టిగా నడుస్తోంది. అజిత్ కూడా కంగువ చిత్రాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే అజిత్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ లో ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇక కంగువ మూవీని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉంది. ఏకంగా 38 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే అన్ని భాషలలో స్ట్రైట్ రిలీజ్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో 100 కోట్లకి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.