ఈ స్టార్ హీరో ఇంకా బతికి ఉన్నాడంటే డాక్టర్ల పుణ్యమే!
అసలు అతడు ఇంకా బతికి ఉన్నాడంటే దానికి కారణం అతడి వైద్యులేనని ప్రముఖ ఆర్థో పెడిక్ సర్జన్ తెలిపారు.
By: Tupaki Desk | 14 Aug 2024 3:39 AM GMTకోలీవుడ్ లో రిస్కుకు వెనకాడని భారీ యాక్షన్ స్టార్‌గా తళా అజిత్‌కి గుర్తింపు ఉంది. సాహస విన్యాసాలు చేయడంలో అతడు పాపులర్. దీని కారణంగా అజిత్ తరచూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాడు. అతడి యాక్షన్-ప్యాక్డ్ చిత్రం వాలిమై షూటింగ్ సమయంలో అత్యంత భయంకరమైన సంఘటన ఒకటి జరిగింది. అసలు అతడు ఇంకా బతికి ఉన్నాడంటే దానికి కారణం అతడి వైద్యులేనని ప్రముఖ ఆర్థో పెడిక్ సర్జన్ తెలిపారు.
ఒకసారి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నప్పుడు తగిలిన గాయాల కారణంగా అజిత్ ప్రమాదకర పక్షవాతానికి గురయ్యే పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు. అతడి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నరేష్ పద్మనాభన్ ఈ విషయాన్ని పాపులర్ మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 2022లో విడుదలైన వాలిమై భారీ యాక్షన్ చిత్రం. ఇందులో అజిత్ గట్సీ మోటార్‌సైకిల్ విన్యాసాలు అవసరమయ్యే పాత్రను పోషించాడు. స్వతహాగా మోటార్‌స్పోర్ట్స్ అంటే అతడికి ఉన్న పిచ్చి గురించి తెలిసిందే. దీనినే తెరపైనా ప్రదర్శించాడు. నిజజీవితంలోని తన అభిరుచిని అక్కడా విడిచిపెట్టలేదు. అయితే అనూహ్యంగా షూటింగ్ సమయంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ముఖ్యంగా అతని వెన్నెముకకు గాయమైంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కథనం ప్రకారం.. అజిత్‌కు రెండో స్థాయి సెర్వికల్ డిస్సెక్టమీ జరిగింది. ఇది అతడి నాడీ వ్యవస్థను స్థింబింపజేసేలా నొక్కిన ఎముకను తొలగించేందుకు కారణమైందని డాక్టర్ పద్మనాభన్ వివరించారు. అతడు తన వెన్నుముకలో కూడా ఫ్రాక్చర్‌తో బాధపడ్డాడు. ఇది అతడిని పక్షవాతం అంచున ఉంచింది. ఇంత జరిగినా ఈరోజు అతడు బతికి ఉన్నందుకు వైద్యులకు కృతజ్ఞతలు చెప్పాలి! అని ఆయన అన్నారు.
కొన్నేళ్లుగా సినీరంగంలో ఉన్న అజిత్ షూటింగుల సమయంలో చాలాసార్లు గాయాలకు గురయ్యాడు. అతడి వీపు, భుజాలు, మోకాళ్లపై అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. యాక్షన్ సీక్వెన్స్‌లలో వాస్తవికత కోసం అతడి డెడికేషన్, అన్వేషణ తరచుగా తీవ్రమైన భౌతిక గాయాలకు పరిణామాలకు దారితీసింది. అందుకే డాక్టర్ పద్మనాభన్ అజిత్ విన్యాసాలు అతని అభిమానులలో అవాస్తవ అంచనాలను సృష్టించవచ్చని భయాన్ని వ్యక్తం చేశారు. నిజ జీవితంలో అతడి ప్రమాదకరమైన చర్యలను అనుకరించవద్దని వారిని కోరారు. అజిత్ ప్రదర్శనలు సందేశాన్ని అందించడానికి, పడిపోయిన తర్వాత కూడా తిరిగి లేవగలమని చూపించడానికి ఉద్దేశించినవి అయితే.. అటువంటి విన్యాసాల వాస్తవికత ప్రమాదాలతో నిండి ఉందని డా.పద్మనాభన్ అన్నారు.
వాలిమైలో అజిత్ కి యాక్సిడెంట్ అయిన షాట్ వీడియో అప్పట్లో వైరల్ అయింది. దానిని ప్రజలంతా చూసి షాక్ తిన్నారు. అయితే బైక్‌పై విన్యాసాలు చేస్తూ నాలుగైదు సార్లు గాయపడ్డాడు. తన సినిమాల ద్వారా సానుకూల సందేశాన్ని అందించాలనుకున్నాడు. ``నువ్వు పడిపోయినా మళ్లీ లేవగలవు`` అన్న సందేశం ఇవ్వాలనేది అతడి ఉద్ధేశం అని కూడా వెల్లడించారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నప్పుడు తగిలిన గాయాల కారణంగా అజిత్ పక్షవాతానికి గురయ్యే పరిస్థితి కి వచ్చాడని డాక్టర్ నరేష్ పద్మనాభన్ ఒకసారి ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అజిత్ కుమార్ తన చిత్రం వాలిమైలో బాడీ డబుల్ లేకుండా అన్ని విన్యాసాలు చేశాడు. ప్రస్తుతం తన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ని పూర్తి చేస్తున్నాడు. ఈ చిత్రం 2025 పొంగల్‌కు విడుదల కానుంది. ఇందులో త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తళా అజిత్ సాహసాలు, ఎదుర్కొన్న ప్రమాదాల గురించి ప్రజలకు తెలిసినది చాలా తక్కువ అని ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టే!