Begin typing your search above and press return to search.

ఆ హిట్ సీక్వెల్ లో కొత్త అందం!

`ఆషీకీ` ప్రాంచైజీ నుంచి థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కూడా రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Sep 2023 2:45 AM GMT
ఆ హిట్ సీక్వెల్ లో కొత్త అందం!
X

`ఆషీకీ` ప్రాంచైజీ నుంచి థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కూడా రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ న‌టిస్తుండ‌గా అనురాగ్ బ‌సు తెర‌కెక్కిస్తున్నారు. ఈ ప్రాంచైజీలో హీరోయిన్ అత్యంత కీల‌కమైన నేప‌థ్యంలో ఆ పాత్ర ఎవ‌రు ? పోషిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని మేక‌ర్స్ దీపికా పదుకొణే..క‌త్రినా కైప్ లాంటి భామ‌ల్ని ప‌రిశీలించారు.

వాళ్లిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌ర్నీ ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని వినిపించింది. అయితే ఇప్పుడా నిర్ణ‌యం మారిన ట్లు తెలుస్తోంది. పేరున్న హీరోయిన్ క‌న్నా! కొత్త న‌టి అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ స్థానంలో యువ న‌టి ఆకాంక్ష శ‌ర్మ‌ని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఆమెతో చిత్ర బృందం చాలా కాలంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలిసింది. దాదాపు అమెనే మేక‌ర్స్ ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఇదే నిజ‌మైతే ఆకాంక్ష శ‌ర్మ కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న‌ట్లే. ఆకాక్షం శ‌ర్మ కెరీర్ ఇప్పుడే మొదలైంది. మోడ‌ల్ గా..జూనియ‌ర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న అవ‌కాశాలు అందుకుంటుంది. ఇలాంటి స‌మ‌యంలో ఏకంగా `ఆషీకీ-3`లోనే న‌టించే ఛాన్స్ అందుకుంటే అమ్మ‌డి రేంజ్ మారిపోవ‌డం ఖాయం. అందులో హీరోయిన్ పాత్ర‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. రెండు భాగాలు హీరో-హీరోయిన్ మ‌ధ్య చుట్టు సాగే రొమాంటిక్ స్టోరీ అది.

ఆ ప్రాంచైజీ అంత పెద్ద విజ‌యం సాధించింది అంటే క‌థ‌తో పాటు హీరో-హీరోయిన్ల పెర్పార్మెన్స్ అన్న‌ది ప్ర‌ధాన కార‌ణం. అందుకే హీరో పాత్ర‌కి ఏరికోరి మ‌రీ కార్తిక్ ఆర్య‌న్ లాంటి ట్యాలెంటెడ్ న‌టుడ్ని తీసుకు న్నారు. మేకర్స్ ఆకాక్షం శ‌ర్మ‌లో కూడా కొన్నియూనిక్ క్వాలిటీలు చూసారు. అందుకే మ‌రో ఆలోచ‌న లేకుండా ఆమెతోనే సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. కార్తీక్ స‌ర‌స‌న ఈ బ్యూటీ అయితే ప‌క్కాగా యాప్ట్ అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇలా కొన్ని కార‌ణాలు ఆకాంక్ష శ‌ర్మ‌ని ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.