Begin typing your search above and press return to search.

ఖాళీగా లేను..ఈసారి గ‌ట్టిగానే ప్లాన్ చేసా!

ఆకాష్ పూరి సినిమా చేసి రెండేళ్లు అవుతుంది. `చోర్ బ‌జార్` ప్లాప్ త‌ర్వాత ఆకాష్ టాపిక్ ఇండ‌స్ట్రీ లే వినిపించ‌లేదు

By:  Tupaki Desk   |   19 Aug 2024 7:10 AM GMT
ఖాళీగా లేను..ఈసారి గ‌ట్టిగానే ప్లాన్ చేసా!
X

ఆకాష్ పూరి సినిమా చేసి రెండేళ్లు అవుతుంది. `చోర్ బ‌జార్` ప్లాప్ త‌ర్వాత ఆకాష్ టాపిక్ ఇండ‌స్ట్రీ లే వినిపించ‌లేదు. దీనికి తోడు డాడ్ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ కూడా ప్లాప్ ల్లో ఉండ‌టంతో? స‌న్నివేశం మ‌రింత జ‌ఠిలంగా మారింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `డ‌బుల్ ఇస్మార్ట్` కూడా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌డం లేదు. దీంతో పూరి అండ్ కో అంతా ప్లాప్ ల మ‌యం అన్న‌ట్లు హైలైట్ అవుతుంది.

ఈ నేప‌థ్యంలో ఆకాష్ కూడా హైలైట్ అవుతున్నాయి. తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా లైన్ లోకి వ‌చ్చిన ఆకాష్ అప్ డేట్ రివీల్ చేసాడు. `నేను ఈ వీడియో రిలీజ్ చేయ‌డానికి కార‌ణం ఒక‌టుంది. ఏం చేస్తున్నావ్? అని అంతా అడుగుతున్నారు. సినిమా ప్ర‌క‌టించి రెండేళ్లు అయింది. ఎందుకు ఖాళీగా ఉంటున్నావ్? అంటున్నారు. నేను ఖాళీగా లేను. జాగ్ర‌త్త‌గా ఉంటున్నానంతే. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా క‌థ‌లు విన్నాను.

ఇప్పుడు నాకు మంచి నిర్మాణ సంస్థ దొరికింది. మంచి ద‌ర్శ‌కుడు కుదిరాడు. చాలా క‌థ‌లు విన్న‌ప్పుడు కొంచెం క‌న్ ప్యూజ‌న్ కి గుర‌య్యాను. కానీ ఇప్పుడు దేవుడు ద‌య వ‌ల్ల‌, నేను న‌మ్మిన అమ్మ వారి వ‌ల్ల నాకంటూ ఓ మంచి టీమ్ దొరికింది. ఈసారి గ‌ట్టిగానే కొట్టాల‌ని ఫిక్స్ అయ్యా. ఓసినిమా కూడా ఫైన‌ల్ చేసాను. పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త అప్ డేట్ ఇస్తాను. మీరంతా నాకు తోడుగా ఉండాల‌ని కోరుకుంటున్నా` అని అన్నాడు.

ఆకాష్ ఇప్ప‌టికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. `ఆంధ్రా పోరి` సినిమాతో లాంచ్ అయ్యాడు. టుపై పూరి స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో `మెహ‌బూబా` చేసాడు. ఇందులో ఆకాష్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. కానీ క‌మ‌ర్శియ‌ల్ గా విజ‌యం సాధించ‌లేదు. అటుపై `రొమాంటిక్`, `చోర్ బ‌జార్` సినిమాలు చేసాడు. వాటి ఫ‌లితాలు నిరాశ ప‌రిచాయి.