బెంగాల్ బస్సులపై బాలయ్య శివ తాండవం!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రిలీజ్ అయిన `అఖండ` ఎలాంటి విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 7 Feb 2025 9:28 AM GMTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రిలీజ్ అయిన `అఖండ` ఎలాంటి విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో రిలీజ్ చేయలేదు గానీ చేసి ఉంటే? బాలయ్య `అఖండ` తోనే పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యేవారు.కేవలం ఓటీటీలో..టీవీలో నార్త్ లో రిలీజ్ అయిన కంటెంట్ తోనే బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు `అఖండ-2`ని పాన్ ఇండియాలో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.
బాలయ్య శివ తాండవం ఎలా ఉంటుందో? బిగ్ స్క్రీన్ పై హిందీ అభిమానులు చూడబోతున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటి అంతే ప్రతిష్టాత్మకంగా ఎగ్జోటిక్ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. బాలయ్య సహా ప్రధాన తారగాణంపై కుంభ మేళలో షూటింగ్ నిర్వహించారు. సినిమాలో ఆ సన్నివేశాలు రియలిస్టిక్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నాయి.
అయితే నార్త్ లో బాలయ్య ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదోక మంచి ఉదాహరణ. కుంభమేళా నేపథ్యంలో భారీ ఎత్తున వాహనాలు ప్రయాగ్ రాజ్ కు తరలి వెళ్తోన్న సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో యాత్రికులు వెళ్తున్నారు. దీనిలో భాగంగా వెస్ట్ బెంగాల్ బస్సులు ఏకంగా బాలయ్య అఖండ పోస్టర్ తో నిండిపోయాయి.
ఆ బస్సుల్ని ప్రత్యేకంగా ఆ పోస్టర్లతో డిజైన్ చేసారు. బాలయ్య శివ తాండవం ఆడేస్తోన్న లుక్ చూడొచ్చు. దానికి సంబంధించిన పోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో బాలయ్య అఖండ పశ్చిమ బెంగాల్ ఎంత సంచలనమైందో ప్రూవ్ అవుతుంది. హిందుత్వం కాన్సెప్ట్ అక్కడ బాగా కనెక్ట్ అయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అఖండ-2 కోసం వెస్ట్ బెంగాల్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలుస్తోంది.