Begin typing your search above and press return to search.

అఖండ 2 అదిరిపోయే అప్డేట్స్.. నందమూరి ఫ్యాన్స్ కి పండగే..!

బాలకృష్ణ కూడా ఈ సినిమా విషయంలో తగ్గేదేలేదు అన్నట్టుగా ఉన్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 7:10 AM GMT
అఖండ 2 అదిరిపోయే అప్డేట్స్.. నందమూరి ఫ్యాన్స్ కి పండగే..!
X

నందమూరి బాలకృష్ణ చేసిన అఖండ సూపర్ హిట్ కాగా ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ అఖండ 2 సెట్స్ మీద ఉంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంది. సినిమా కలెక్షన్స్ తో పాటు థియేటర్ లో స్పీకర్లు కూడా బ్లాస్ట్ అయ్యేలా ఆ ఇద్దరి కాంబో సినిమా ఫోర్స్ ఉంటుంది. అఖండ 2 పై ఉన్న అంచనాలకు ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారట బోయపాటి. బాలకృష్ణ కూడా ఈ సినిమా విషయంలో తగ్గేదేలేదు అన్నట్టుగా ఉన్నారని తెలుస్తుంది.

ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న అఖండ 2 సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేశారని తెలుస్తుంది. బాలయ్య ఎంట్రీనే భారీ ఫైట్ తో ప్లాన్ చేశారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో వన్ ఆఫ్ ది హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఫైట్ మాస్టర్స్ రామ్ ల‌క్ష్మణ్ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారని తెలుస్తుంది.

దీనితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. బాలకృష్ణ అఖండ 2 సినిమాలో ప్రతినాయకుడి పాత్ర ఎవరు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ నుంచే విలన్ ని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ బాలకృష్ణ డాకు మహారాజ్ లో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ని విలన్ గా దించుతున్నారు. అఖండ 2 కోసం మరో స్టార్ ని తీసుకుంటారని తెలుస్తుంది.

బాలకృష్ణ అఖండ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించాలని చూస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి ఈ కాంబో అంటేనే నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది. బాలయ్య డాకు మహారాజ్ 2025 సంక్రాంతికి వస్తుంటే అఖండ 2 ని దసరా కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రెండు సినిమాలు కూడా ఫ్యాన్స్ కి ఫెస్టివల్ ట్రీట్ ని డబుల్ చేస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు.