Begin typing your search above and press return to search.

అఖండ 3కి పర్ఫెక్ట్ లీడ్..?

ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ అయితే అప్పటివరకు ఉన్న బాలయ్య సినిమా రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త సంచలనాలు సృష్టించింది.

By:  Tupaki Desk   |   2 March 2025 7:00 AM IST
అఖండ 3కి పర్ఫెక్ట్ లీడ్..?
X

నందమూరి బాలకృష్ణ ఈమధ్య వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే సంక్రాంతికి డాకు మహారాజ్ తో వచ్చి సక్సెస్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ అఖండ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టే లెక్క. బాలయ్య ని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఊగిపోతారో బోయపాటికి బాగా తెలుసు అందుకే ఆయన సినిమాల్లో బాలకృష్ణ ఉగ్ర రూపం చూపిస్తారు. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ అయితే అప్పటివరకు ఉన్న బాలయ్య సినిమా రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త సంచలనాలు సృష్టించింది.

ఐతే ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ గా అఖండ 2 సినిమా చేస్తున్నారు. అఖండ ఎంత హిట్ అయ్యిందో ఆ సీక్వెల్ ని అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈమధ్య జరిగిన మహా కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఇక ఇప్పుడు హిమాలయాల్లో కూడా షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అఖండ 2 తో బాలకృష్ణ ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు.

అఖండ సినిమా నార్త్ ఆడియన్స్ కూడా ఇష్టపడ్డారు. అఖండ హిందీ డబ్బింగ్ కి మంచి వ్యూస్ వచ్చాయి. అందుకే అఖండ 2 ని డైరెక్ట్ గా రిలీజ్ చేసేలా చూస్తున్నారు. ఐతే అఖండ 2 తో బోయపాటి ప్లానింగ్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సినిమా లో బాలయ్య ఎలివేషన్స్, యాక్షన్ వేరే లెవెల్ అని తెలుస్తుంది. అంతేకాదు అఖండ 2 లో పార్ట్ 3 కి సంబందించిన అదిరిపోయే ట్విస్ట్ రివీల్ చేస్తారని తెలుస్తుంది.

అఖండ 2 చివర్లో అఖండ 3 కి లీడ్ ఇస్తారట. అఖండ 2 లో కథ వేరే మలుపు తీసుకోగా పార్ట్ 2 పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికతతో ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య అఘోరా రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తానికి బోయపాటి అఖండ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారని అనిపిస్తుంది.

అఖండ 2 మాత్రమే కాదు అఖండ 3 కూడా ఉంటుందని పార్ట్ 2 లో మూడో భాగానికి సంబందించిన ట్విస్ట్ ఉంటుందని అది ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుందని చెప్పుకుంటున్నారు. మరి బాలయ్య, బోయపాటి ఏం చేస్తున్నారో కానీ అఖండ తరహాలో అఖండ 2 థియేటర్ లు కూడా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేలా ఉన్నారని మాత్రం అర్థమవుతుంది.