Begin typing your search above and press return to search.

మహా కుంభమేళాకి 'అఖండ 2' టీం.. ఎందుకంటే!

ఇప్పటికే పలు చోట్ల బ్రేక్ ఈవెన్‌కి దగ్గర అయిన ఈ సినిమా వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్‌ మార్క్‌ని చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   16 Jan 2025 7:45 AM GMT
మహా కుంభమేళాకి అఖండ 2 టీం.. ఎందుకంటే!
X

బాలకృష్ణ వరుసగా నాల్గవ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అఖండతో ప్రారంభం అయిన బాలకృష్ణ విజయాల జోరు వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరిలతో హ్యాట్రిక్ దక్కించుకోగా తాజాగా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా సైతం సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన డాకు మహారాజ్ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేస్తున్న సినిమాగా నిలువబోతుంది. ఇప్పటికే పలు చోట్ల బ్రేక్ ఈవెన్‌కి దగ్గర అయిన ఈ సినిమా వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్‌ మార్క్‌ని చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

డాకు మహారాజ్ సినిమా సక్సెస్‌ జోష మీద ఉన్న బాలకృష్ణ ఇప్పటికే అఖండ 2 సినిమాను ప్రారంభించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటి వరకు బాలకృష్ణ హీరోగా వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే అఖండ 2 తో మరో విజయాన్ని వీరి కాంబో దక్కించుకోబోతుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఉన్న ఫామ్‌ నేపథ్యంలో అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, అఖండ ను మించి సీక్వెల్‌కి దర్శకుడు బోయపాటి శ్రీను ప్లాన్‌ చేశాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

అఖండ 2 సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రస్తుతం యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. కుంభమేళాకి సంబంధించిన విజువల్స్‌ను క్యాప్చర్‌ చేసేందుకు గాను దర్శకుడు బోయపాటి శ్రీను అక్కడకు వెళ్లారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌ జరుపనున్నారు. బాలకృష్ణ డూప్‌తో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సైతం జరిపనున్నారు. ఆ తర్వాత బాలకృష్ణపై సన్నివేశాలను చిత్రీకరించి కుంభమేళ విజువల్స్‌తో మిక్స్ చేస్తారని తెలుస్తోంది. బాలకృష్ణ ను అఘోరగా చూపించబోతున్న అఖండ 2 లో మహా కుంభమేళ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

సనాతనధర్మంను చాటి చెప్పే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. సరైన సమయంలో కుంభమేళా జరుగుతుంది కనుక అఖండ 2 కోసం అక్కడి విజువల్స్‌ను వినియోగించుకోబోతున్నారు. గతంలో ఉన్న విజువల్స్‌ను వినియోగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాని దర్శకుడు బోయపాటి తనకు కావాల్సిన విధంగా విజువల్స్‌ను తీసుకోవడం కోసం తన టీంతో అక్కడకు వెళ్లారు. బాలకృష్ణ సైతం రెండు మూడు రోజులు అక్కడ షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు.