తండ్రీ తనయులిద్దరు ఒకేసారి రంగంలోకి!
ఈ నేపథ్యంలో పండగ అనంతరం కొత్త ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం సాగింది.
By: Tupaki Desk | 18 Nov 2024 9:30 AM GMTనందమూరి వారసులు- తండ్రి తనయులిద్దరు ఒకేసారి రంగంలోకి దిగుతున్నారా? అందుకు ముహూర్తం కూడా పెట్టేసారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే నటసింహ బాలకృష్ణ-బోయపాటి దర్శకత్వంలో 'అఖండ-2' ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీని కూడా యువ దర్శకుడుప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కన్పమ్ చేసారు. అయితే ఇప్పుడీ సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో పండగ అనంతరం కొత్త ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం సాగింది. అయితే బాలయ్య- మోక్షజ్ఞ అంత వరకూ వెయిట్ చేయడం లేదు. డిసెంబర్ నెలలోనే రెండు సినిమాలు రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. 'అఖండ-2' షూటింగ్ డిసెంబర్ రెండవ వారంలో... ఐదు రోజుల గ్యాప్ అనంతరం మోక్షజ్ఞ చిత్రాన్ని పట్టాలెక్కించాలనుకుంటున్నారు.
వాస్తవానికి రెండు సినిమాలు ఒకే రోజు మొదలు పెట్టాలనుకున్నారుట. కానీ కొన్ని సెంటిమెంట్ సమీకరణాల నేపథ్యంలో ఒకే రోజు రెండు షూటింగ్లు మొదలు పెట్టకూడదని బాలయ్య చిత్ర యూనిట్ లకు సూచించారుట. దీంతో తనయుడు చిత్రాన్ని ఐదు రోజులు ఆలస్యంగా ముహూర్తం పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. 'అక్షండ 2'తొలి షెడ్యూల్ లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటుందని సమాచారం.
మోక్షజ్ఞ చిత్రం కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్లు వేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో కామన్ పాయిం ట్ ఏంటంటే? రెండు కూడా ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న బలమైన కథలతోనే ముస్తాబవ్వడం విశేషం. బాలయ్యకి బోయపాటి సెంటిమెంట్ డైరెక్టర్. ఇప్పటి వరకూ ఆ కాంబలో పెయిల్యూర్ కూడా లేదు. అందుకే తనయుడి సినిమా కాన్సెప్ట్ విషయంలోనూ సెంటిమెంట్ ని బేస్ చేసుకున్నారు. ప్రశాంత్ వర్మతో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది బాలయ్యనే అన్న సంగతి తెలిసిందే.