Begin typing your search above and press return to search.

అఖండ 2లో సెకండ్ ఛాన్స్ ఎవరికి..?

అందుకే మరోసారి బోయపాటితో ఆ సినిమాకు కొనసాగింపుని తీయాలని ఫిక్స్ అయ్యాడు బాలకృష్ణ.

By:  Tupaki Desk   |   31 May 2024 9:58 AM GMT
అఖండ 2లో సెకండ్ ఛాన్స్ ఎవరికి..?
X

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ఈ కాంబినేషన్ లో వచ్చే ఏ సినిమా అయినా సరే ఆడియన్స్ కు మాస్ ట్రీట్ అందించాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. సింహా నుంచి అఖండ వరకు వీరి కాంబినేషన్ హిట్ మేనియా కొనసాగించింది. అయితే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. కమర్షియల్ హిట్ తో పాటుగా ఆ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే మరోసారి బోయపాటితో ఆ సినిమాకు కొనసాగింపుని తీయాలని ఫిక్స్ అయ్యాడు బాలకృష్ణ.

త్వరలో అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఎన్.బి.కె 109వ సినిమా పూర్తి కాగానే అఖండ 2 ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు బాలయ్య బాబు. ఐతే అఖండ 2 లో హీరోయిన్ విషయంపై కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. అఖండ లో ప్రగ్యా జైశ్వాల్ నటించింది. కెరీర్ లో అంత గొప్పగా అవకాశాలు లేని ప్రగ్యా జైశ్వాల్ అఖండ తో సూపర్ హిట్ అందుకున్నా ఆమెకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు అఖండ 2 తో మళ్లీ ఆమెకు ఛాన్స్ ఇస్తారా లేదా వేరే హీరోయిన్ ని తీసుకుంటారా అని డిస్కషన్ జరుగుతుంది.

అయితే అఖండ 2 లో వేరే హీరోయిన్ కి వెళ్లాలనుకుంటే మాత్రం అది పక్కాగా కాజల్ అగర్వాల్ అవుతుందని అంటున్నారు. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ నటించింది. ఆ సినిమాలో బాలయ్య తో కాజల్ కు మంచి రిలేషన్ ఏర్పడింది. అందుకే ఆమె నటించిన సత్యభామ ఈవెంట్ కు బాలకృష్ణ వచ్చారు. ఇదే సందర్భంలో అఖండ 2 లో కూడా కాజల్ ఉంటే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట.

అఖండ 2లో ఒకవేళ ప్రగ్యా కొనసాగించినా కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా కాజల్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. సో అఖండ 2 లో కాజల్ సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది. పెళ్లి తర్వాత కాజల్ సినిమాల విషయంలో దూకుడు పెంచుతుంది. సత్యభామ సక్సెస్ అయితే మాత్రం ఆమె ఖాతాలో ఇంకా అలాంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేసే అవకాశం ఉంది. అఖండ 2 లో కూడా కాజల్ భాగం అయితే అమ్మడికి ఇంకా బూస్టింగ్ ఇచ్చినట్టే అని చెప్పొచ్చు.