Begin typing your search above and press return to search.

అఖండ 2.. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో న్యూ ట్విస్ట్..

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ అఖండ.

By:  Tupaki Desk   |   24 July 2024 5:05 AM GMT
అఖండ 2.. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో న్యూ ట్విస్ట్..
X

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ అఖండ. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఈ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 ఉంటుందని అప్పుడే బోయపాటి ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సీక్వెల్ కి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చింది. పోస్టర్ తో అఖండ 2 సినిమాని కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే మూవీ స్క్రిప్ట్ వర్క్ ని బోయపాటి స్టార్ట్ చేసాడంట.

ఇదిలా ఉంటే అఖండ కంటే హైవోల్టేజ్ కథాంశంతో ఈ సీక్వెల్ ని బోయపాటి రెడీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సీక్వెల్ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. బాలయ్య చిన్న కూతురు ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా అడుగుపెడుతోంది. అఖండ సీక్వెల్ లో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లోనే కనిపించబోతున్నారంట.

అలాగే ప్రగ్యా జైశ్వాల్ క్యారెక్టర్ కొనసాగింపు ఉంటుందంట. ఈ స్టోరీ అఘోర క్యారెక్టర్ లో ఉన్న బాలయ్య మీదనే నడుస్తుందంట. ఆధ్యాత్మిక కోణంలో కథని డైరెక్టర్ బోయపాటి రి ప్రజెంట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే అఖండ మూవీకి థమన్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమా సక్సెస్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. తన మ్యూజిక్ తో థమన్ గూస్ బాంబ్స్ క్రియేట్ చేసాడు.

అలాగే బోయపాటి స్కంద సినిమాకి కూడా థమన్ మ్యూజిక్ అందించారు. అయితే ఆ మూవీ అంతగా క్లిక్ కాలేదు. ఇదిలా ఉంటే అఖండ 2 కోసం ఇప్పుడు బోయపాటి థమన్ ని పక్కన పెట్టారని తెలుస్తోంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ని అఖండ 2 కోసం బోయపాటి కన్ఫర్మ్ చేశారట. ఇప్పటికే హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమాకు కొన్ని సాంగ్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తం తనే చూసుకున్నాడు.

ఇప్పుడు అఖండ 2తో మరో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ స్పిరిట్ సినిమాకి కూడా హర్షవర్ధన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారంట. అఖండ 2 లాంటి హైవోల్టేజ్ యాక్షన్ మూవీకి హర్షవర్ధన్ మ్యూజిక్ అందించి సక్సెస్ అందుకుంటే ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో ఇతర క్యాస్టింగ్ ని త్వరలో బోయపాటి ఎనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చనే మాట వినిపిస్తోంది.