Begin typing your search above and press return to search.

అఖండ 2 గురించి పుకార్లే పుకార్లు..!

వీరి కాంబోకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన అఖండ కు సీక్వెల్‌ రూపొందబోతుంది.

By:  Tupaki Desk   |   15 July 2024 10:54 AM GMT
అఖండ 2 గురించి పుకార్లే పుకార్లు..!
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో వీరి కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా పై అంతకు మించి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. వీరి కాంబోకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన అఖండ కు సీక్వెల్‌ రూపొందబోతుంది.

ఇప్పటికే అఖండ 2 సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ కి దర్శకుడు బోయపాటి లాక్ చేశాడు. స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథ లో కూడా బాలయ్య ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూడబోతున్నాం.

ఇక ఈ సినిమా గురించి పుకార్ల మీద పుకార్లు వస్తూనే ఉన్నాయి. సాధారణంగానే సినిమాలకు మంచి బజ్‌ క్రియేట్‌ అయిన సమయంలో పుకార్లు పెద్ద ఎత్తున రావడం చూస్తూ ఉంటాం. ఈ సినిమాకు కూడా విపరీతమైన బజ్ క్రియేట్‌ అవుతున్న కారణంగా రోజు రోజు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాలో సోషియో ఫాంటసీ సీన్ లు కొన్ని ఉండబోతున్నాయి అనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ లకు మంచి ఆధరణ లభిస్తుంది. అంతే కాకుండా ఒక హిట్ సెంటిమెంట్‌ గా కూడా సోషియో ఫాంటసీ లు నిలుస్తున్నాయి.

చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇంకా కొన్ని సినిమాలు కూడా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ తో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అఖండ 2 లో కూడా సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ను జోడించారు అనేది పుకార్ల సారాంశం. ఇదే నిజం అయితే బాలయ్య ఫ్యాన్స్ కి పెద్ద గుడ్‌ న్యూస్ గా చెప్పుకోవచ్చు.