Begin typing your search above and press return to search.

బాలయ్య బర్త్ డే.. రూ.150 కోట్లతో అలా..

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jun 2024 8:17 AM GMT
బాలయ్య బర్త్ డే.. రూ.150 కోట్లతో అలా..
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల కోసం నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉంటారు. గత ఏడాది భగవంత్ కేసరితో దసరాకు వచ్చారు బాలయ్య. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా.. మంచి వసూళ్లు సాధించింది. ఇటీవల చిలకలూరిపేటలోని ఓ థియేటర్ లో ద్విశత దినోత్సవం కూడా ఘనంగా జరుపుకుంది.

అయితే బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. బాలయ్య మాస్ లుక్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది.

ఏపీ అసెంబ్లీ పోరు సందర్భంగా.. NBK 109 షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఎన్నికల సమరంలోకి దిగారు బాలయ్య. పెద్ద ఎత్తున ప్రచారం చేసి హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలుపొందారు. ఇప్పుడు మళ్లీ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారు. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే జూన్ 10వ తేదీన బాలయ్య బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటు ఆరోజు మరో బిగ్ అనౌన్స్మెంట్ రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండ-2 అధికారిక ప్రకటన సోమవారం వెలువడనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బాలయ్య హీరోగా బోయపాటి తెరకెక్కించనున్న ఈ సినిమా.. రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం బాలయ్య, బోయపాటి భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నారని టాక్.

అఖండ సీక్వెల్ పూజా కార్యక్రమాలు జూన్ 10వ తేదీన హిందూపురంలో జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకు మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారట. 14 రీల్స్ బ్యానర్ పై అఖండ-2 తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్ మ్యూజిక్ అందించనున్నారని వినికిడి. ప్రస్తుతం బోయపాటి శ్రీను.. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మొత్తానికి బాలయ్య బర్త్ డేకి ఫ్యాన్స్ కు మంచి సర్ప్రైజ్ లు ఉన్నాయన్నమాట!