Begin typing your search above and press return to search.

'అఖండ' ఫ్యాన్స్ కి మ్యూజికల్‌ గుడ్‌ న్యూస్‌

తాజాగా సంగీత దర్శకుడు థమన్ తన హిట్ సినిమాల ఓఎస్‌టి లు ఒకొక్కటిగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశాడు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 5:00 AM GMT
అఖండ ఫ్యాన్స్ కి మ్యూజికల్‌ గుడ్‌ న్యూస్‌
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'అఖండ' 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాలయ్య వరుస ఫ్లాప్స్ తో ఉన్న సమయంలో అఖండ సాధించిన విజయం ఆయనతో పాటు ఫ్యాన్స్ కి కూడా మంచి ఉత్సాహాన్ని తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.

అఖండ విజయంలో కథ, కథనం, యాక్షన్‌ సన్నివేశాలు, బోయపాటి యాక్షన్ టేకింగ్‌ లు ఎంతగా పని చేశాయో అంతకు మించి అన్నట్లుగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ పని చేసింది అనడంలో సందేహం లేదు. హీరో బాలయ్య ను థమన్ తన బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ తో మరింతగా ఎలివేట్‌ చేశాడు.

మ్యూజిక్ లవర్స్ ముఖ్యంగా సోషల్‌ మీడియా సెలబ్రిటీలు అఖండ ఓఎస్‌టి(ఒరిజినల్‌ సౌండ్ ట్రాక్‌) కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఏదైనా సినిమా విడుదల అయితే కొన్ని రోజుల్లోనే ఓఎస్‌టి విడుదల చేయడం పరిపాటిగా వస్తుంది. కానీ అఖండ కోసం ఇన్నాళ్లు వెయిట్‌ చేయాల్సి వచ్చింది.

తాజాగా సంగీత దర్శకుడు థమన్ తన హిట్ సినిమాల ఓఎస్‌టి లు ఒకొక్కటిగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. అన్నింటిలోకి చివరిగా అఖండ సినిమా యొక్క ఒరిజినల్‌ సౌండ్ ట్రాక్ ను విడుదల చేయబోతున్నాడు. థమన్ ప్రకటనతో బాలయ్య ఫ్యాన్స్‌ లో ఆనందం మొదలయ్యింది.

ఇన్నాళ్లు ఇంకా ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూసిన వారు ఇప్పుడు థమన్ ప్రకటనతో మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏ క్షణంలో అయినా థమన్ ఆ ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్ ను విడుదల చేసి బాలయ్య ఫ్యాన్స్‌ కి కానుకగా ఇచ్చే అవకాశం ఉంది.

బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను తో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఆ సినిమాకు కూడా థమన్‌ సంగీతాన్ని అందించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.