పుష్ప రాజ్ యాస పట్టనున్న అక్కినేని హీరో?
హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత చిత్తూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 17 March 2025 1:25 PM ISTపుష్ప సినిమాలో అల్లు అర్జున్ విభిన్నమైన యాసతో పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటించాడు. సాధారణంగా స్టార్ హీరోలను అలాంటి యాసలో మాట్లాడటం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. పుష్ప రాజ్ పాత్రతో పాటు యాసకు మంచి స్పందన వచ్చింది. చిత్తూరు జిల్లా యాసను అల్లు అర్జున్ తర్వాత యంగ్ హీరో అఖిల్ అక్కినేని సైతం నేర్చుకునే పనిలో పడ్డట్లు సమాచారం అందుతోంది. ఇటీవల మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా ప్రారంభం అయింది. ఆ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత చిత్తూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ కోసం అఖిల్ స్థానిక మాండలికంను నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. పుష్ప కోసం అల్లు అర్జున్ ఎలా అయితే విభిన్నమైన మాండలికంలో మాట్లాడాడో అలాగే అఖిల్ సైతం చిత్తూరు యాసలో మాట్లాడేందుకు ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. 'వినరో భాగ్యము విష్ణు కథా' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమా కోసం విభిన్నమైన పల్లెటూరు బ్యాక్ డ్రాప్ కథను రెడీ చేశాడని, అఖిల్‌కు ఈ సినిమా మొదటి కమర్షియల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది అనే విశ్వాసంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ కూడా భాగస్వామ్యం కావడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్, సితార వారు కలిసి మొదటి ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో పల్లెటూరు కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలోనే అఖిల్ లుక్ కి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇటీవలే నాగ చైతన్య తండేల్ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తండేల్ సినిమాలో నాగ చైతన్య శ్రీకాకులం మాండలికంలో మాట్లాడి అందరినీ సర్‌ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు తమ్ముడు అఖిల్ సైతం కొత్త మాండలికంను నేర్చుకునే పనిలో ఉన్నాడు. డబ్బింగ్ చెప్పే సమయంలో మేనేజ్ చేయవచ్చు. కానీ ముందుగానే నేర్చుకుంటే షూటింగ్ సమయంలోనే ఇబ్బంది లేకుండా ఉంటుందని, నేచురల్‌గా ఉంటుంది అని హీరోలు ఆయా మాండలికాలను నేర్చుకుంటూ ఉంటారు. అందుకోసం హీరోలు చాలానే కష్టపడుతూ ఉంటారు. వారి పట్టుదలకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే.