అఖిల్ బాబు అలా సరిపెడుతున్నాడు..!
ఇదేదో సినిమా కోసమే అని ఫ్యాన్స్ అనుకుంటే దాదాపు ఐదారు నెలల నుంచి బయట కనిపిస్తున్నాడు కానీ సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వట్లేదు.
By: Tupaki Desk | 4 Feb 2025 12:45 PM GMTఅక్కినేని యువ హీరో అఖిల్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటే అఖిల్ మాత్రం సినిమాలను చాలా లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. అదెలా అంటే అఖిల్ సినిమా ఏజెంట్ వచ్చి దగ్గర దగ్గర రెండేళ్లు కావొస్తుంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని కొన్నాళ్లు బాధపడ్డ అఖిల్ నెక్స్ట్ సినిమాకు మూవ్ ఆన్ అవుతాడు అనుకుంటే జులపాల జుట్టు, గుబురు గడ్డంతో కనిపించాడు. ఇదేదో సినిమా కోసమే అని ఫ్యాన్స్ అనుకుంటే దాదాపు ఐదారు నెలల నుంచి బయట కనిపిస్తున్నాడు కానీ సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వట్లేదు.
ఈమధ్య ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన అఖిల్ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ సినిమా అప్డేట్ తో వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఐతే లేటెస్ట్ గా అఖిల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. ఈసారి కూడా సినిమా గురించి కాదు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి మాత్రమే ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఫిబ్రవరి 7 నుంచి సి.సి.ఎల్ మొదలవుతుంది. టాలీవుడ్ టీం కెప్టెన్ గా అఖిల్ మాట్లాడాడు.
మరి సినిమాల గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వని అఖిల్ ఇలా మిగతా విషయాల్లో మాత్రం అలర్ట్ గా ఉన్నాడు. అసలు అఖిల్ నెక్స్ట్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది. కథ లాక్ అయ్యిందా లేదా.. ఎవరు ఆ సినిమా నిర్మిస్తున్నారు. అఖిల్ ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాడు లాంటి వాటి మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఐతే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం చినబాబు సినిమా ఎప్పుడంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు.
ఈసారి గురి పెడితే టార్గెట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో అఖిల్ ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. హోంబలే ప్రొడక్షన్స్, యువి క్రియేషన్స్ అఖిల్ తో ప్రాజెక్ట్ చేస్తున్నారన్న న్యూస్ అయితే వచ్చింది కానీ డైరెక్టర్ మిగతా విషయాల గురించి తెలియట్లేదు. అఖిల్ వేగం పెంచి సినిమాలను త్వరగా పూర్తి చేస్తే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు. అక్కినేని హీరోల్లో అఖిల్ ఇలా ఉండగా నాగార్జున కూడా కథలు దొరక్క సోలో సినిమా ఏది కన్ఫర్మ్ చేయలేదు. మరోపక్క నాగ చైతన్య మాత్రం దూసుకెళ్తున్నాడు. తండేల్ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగ చైతన్య ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు.