Begin typing your search above and press return to search.

వాళ్లిద్ద‌రు తొడ‌గొట్టేదెప్పుడు? మీసం తిప్పేదెప్పుడు?

కోలీవుడ్ లో చియాన్ విక్ర‌మ్ వార‌సుడు ధృవ్ కి ఇంకా స‌రైన స‌క్సెస్ ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Sep 2024 4:30 PM GMT
వాళ్లిద్ద‌రు తొడ‌గొట్టేదెప్పుడు? మీసం తిప్పేదెప్పుడు?
X

కోలీవుడ్ లో చియాన్ విక్ర‌మ్ వార‌సుడు ధృవ్ కి ఇంకా స‌రైన స‌క్సెస్ ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. `ఆదిత్య వ‌ర్మ‌`తో లాంచ్ అయిన ధృవ్ అటుపై వ‌ర్మ‌, మ‌హాన్ సినిమాలు చేసాడు. ఇవేవి బాక్సాఫీస్ వ‌ద్ద సౌండ్ చేయ‌లేదు. విక్ర‌మ్ కొడుకు అనే బ్రాండ్ త‌ప్ప‌! ధృవ్ ఇంపాక్ట్ ఇంకా జ‌నాల్లోకి వెళ్ల‌లేదు. వెనుకుండి విక్ర‌మ్ స‌ల‌హాలు ఇస్తున్నాడు? గానీ ప‌న‌వ్వ‌డం లేదు. ఈ విష‌యంలో ధృవ్ బ్యాడ్ ల‌క్ అనే అనాలి.

విక్ర‌మ్ లాంటి గ్రేట్ పెర్పార్మ‌ర్ ఉండ‌గా ధృవ్ షైన్ అవ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అయితే అందుకు అత‌డొక్క‌డే బాధ్యుడు కాదు. స‌రైన స్టోరీ ప‌డాలి. ఆ స్టోరీకి ధృవ్ సెట్ అవ్వాలి. అది ప్రేక్ష‌కుల్ని మెప్పించ గ‌ల‌గాలి. తాజాగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తితో ధృవ్ ఓ సినిమాచేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. తెలుగు, త‌మిళ్ లో ఈసినిమా చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అటు అక్కినేని వార‌సుడు అఖిల్ ప‌రిస్థితి ఇలాగే ఉంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి తొమ్మిదేళ్లు అవుతుంది. ఇంత‌వ‌ర‌కూ అత‌డి బ్రాండ్ ఇది జ‌నాల్లో ఇంపాక్ట్ ప‌డ‌లేదు. నాలుగైదు సినిమాలు చేసాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి స‌రైన మాస్ హీరో అవుతాడ‌ని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. కానీ అత‌డు చేస్తోన్న ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌లేదు. `ఏజెంట్` తో ప్రూవ్ అవుతాడు? అనుకుంటే మిగ‌తా సినిమాల‌కంటే దారున‌మైన చిత్రంగా నిలిచింది.

ఆ సినిమా కోసం అఖిల్ ఎంతో క‌ష్ట ప‌డ్డాడు. దీంతో అఖిల్ కూడా స్ట్రాంగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు . హిట్ కొట్టే వర‌కూ అభిమానుల ముందుకు రాన‌ని ఒట్టు పెట్టుకున్నాడు. ప్ర‌స్తుతం హిట్ సినిమా స్టోరీ కోసం ఎదురు చూస్తున్నాడు. మ‌రి విక్ర‌మ్ వార‌సుడు ధృవ్..నాగార్జున వార‌సుడు అఖిల్ హిట్ కొట్టి తొడ ఎప్పుడు కొడ‌తారు? మీసం ఎప్పుడు మెలేస్తారు? అన్న‌ది చూడాలి.