Begin typing your search above and press return to search.

అఖిల్ నెక్స్ట్.. మళ్ళీ యాక్షన్ అంటున్నారే..?

ఈ చిత్రానికి వినరో భగ్యము విష్ణు కథ ఫేమ్ కిరణ్ మురళి కిశోర్ అబ్బూర్ దర్శకత్వం వహిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   16 March 2025 10:55 AM IST
అఖిల్ నెక్స్ట్.. మళ్ళీ యాక్షన్ అంటున్నారే..?
X

టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్ హిట్ అవుతుందనుకున్న చిత్రం ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై గందరగోళం నెలకొంది. అయితే ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినప్పటికీ, 'లెనిన్' అనే టైటిల్‌తో కొత్త సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వినరో భగ్యము విష్ణు కథ ఫేమ్ కిరణ్ మురళి కిశోర్ అబ్బూర్ దర్శకత్వం వహిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అయితే మొదట ఈ సినిమా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వచ్చింది. అంతే కాకుండా రంగస్థలం తరహాలో అఖిల్ కు ఇదొక బ్రేక్ అవుతుందని టాక్ వచ్చింది. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ అనే టాక్ కూడా వచ్చింది. కానీ ఇపుడు ఊహించిన విధంగా మళ్ళీ అఖిల్ యాక్షన్ బాట పట్టనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత సినిమాతో యాక్షన్ హీరోగా మారాలనే ప్రయత్నం చేసిన అఖిల్, ఇప్పుడు మరోసారి అదే ఫార్మాట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అఖిల్ కెరీర్‌ను పరిశీలిస్తే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ హిట్ కాగా, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ‘ఏజెంట్’ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ దాంతో నిరుత్సాహ పడకుండా, ఇప్పుడు రొమాన్స్, యాక్షన్ కలిపి బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాడట.

ఈ కొత్త ప్రాజెక్ట్‌లో అఖిల్ తనలోని మాస్ అప్పీల్‌ను చూపించేలా కథ సిద్ధం చేసినట్లు టాక్. ఈ సినిమాకి శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తోన్న శ్రీలీల, అఖిల్ సరసన నటించనున్నందుకు ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఆమె ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్ బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. చిత్తూరు ప్రాంతంలో చోటుచేసుకునే ఓ రూరల్ యాక్షన్ లవ్ స్టోరీగా ‘లెనిన్’ ప్లాన్ అవుతోందని, కథలో విలన్ రోల్ కూడా బాగా హైలైట్ అవుతుందని టాక్.

ఇంతవరకు అఖిల్ పూర్తి మాస్ అవతారం ఎత్తిన సినిమా చేయలేదు. కానీ ‘లెనిన్’ సినిమా పూర్తిగా రాయలసీమ, చిత్తూరు నేపథ్యంలో సాగుతుంది. అఖిల్ ఒక కొత్త డైలెక్ట్, బాడీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడని, ఫైట్ మాస్టర్స్ కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ‘ఏజెంట్’ లో హై-ఫై యాక్షన్ చూపించిన అఖిల్, ఇప్పుడు రూరల్ మాస్ యాక్షన్ లో మెప్పించేందుకు సిద్దమవుతున్నాడు.

ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైందని, ప్రస్తుతం హైదరాబాద్‌లో మరో కొత్త షెడ్యూల్ ఈ నెల 14 నుంచి స్టార్ట్ కానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు కొనసాగనుందని, ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండడం విశేషం. అఖిల్ ఇప్పటివరకు చేసిన సినిమాలలో పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఫిల్మ్ లేదు. కానీ ‘లెనిన్’తో తను పూర్తి స్థాయి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. దర్శకుడు, కథ, కథనం అన్నీ కూడా దాని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.