Begin typing your search above and press return to search.

అయ్యగారు.. మేకోవరే కాకుండా..

సినిమా కోసం అఖిల్ తీవ్రంగా శ్రమించినప్పటికీ లాభం లేకుండా పోయింది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 10:30 PM GMT
అయ్యగారు.. మేకోవరే కాకుండా..
X

యంగ్ హీరో అక్కినేని అఖిల్.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా సరైన హిట్ అందుకోలేదు. ఫస్ట్ మూవీ అఖిల్ డిజాస్టర్ తర్వాత ఒక్క మూవీతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మోస్తరు విజయం అందించింది. ఆ తర్వాత ఏజెంట్ తో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. సినిమా కోసం అఖిల్ తీవ్రంగా శ్రమించినప్పటికీ లాభం లేకుండా పోయింది. కథలో విషయం లేకపోవడం మైనస్ అయింది.

ఆ సినిమా వచ్చి ఏడాది దాటినా.. అఖిల్ ఇంకా కొత్త మూవీని అనౌన్స్ చేయలేదు. ఆయన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించి రకరకాల రూమర్లు వినిపిస్తున్నా.. ఏది కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడం లేదు. గతంలో ప్రభాస్ సలార్ సక్సెస్ మీట్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో ఆయన త్వరలో కొత్త సినిమా అనౌన్స్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ఎలాంటి ప్రకటన కూడా రాలేదు.

ఆ తర్వాత రీసెంట్ గా అఖిల్ లాంగ్ హెయిర్ తో చాలా స్టైలిష్ గా కెమెరాకు చిక్కారు. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ లో అఖిల్ ఓ పీరియాడికల్ డ్రామా చేయనున్నారని.. అందుకే హెయిర్ పెంచారని టాక్ వినిపించింది. దీనిపైనా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు. కొద్ది రోజుల క్రితం హీరో నాగచైతన్య ఎంగేజ్మెంట్ పిక్స్ లో అఖిల్ కనిపించారు. ఫుల్ రగ్డ్ గా ఉన్న ఆయన లుక్ కు సోషల్ మీడియాలో భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా అఖిల్ కొత్త పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో అఖిల్ బాగా స్లిమ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఫేస్ లో చాలా ఛేంజెస్ ఈజీగా తెలుస్తున్నాయి. గడ్డం, మీసం కూడా స్టైలిష్ గా పెంచుతున్నట్లు అర్థమవుతోంది. అలా అఖిల్ ముఖంలో ఫ్రెష్ నెస్ కనిపిస్తుందనే చెప్పాలి. చాలా కొత్తగా ఆయన లుక్ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. నెక్స్ట్ మూవీ కోసం బాగా మేకోవర్ చేసుకుంటున్నట్లు అర్థమవుతుందని అంటున్నారు.

అయితే మేకోవర్ విషయం బాగానే ఉన్నా.. స్టోరీ సెలెక్షన్ లో అలాంటి ఛేంజే ఉంటే బాగుంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏజెంట్ మూవీ విషయంలో అదే జరిగిందని అంటున్నారు. అఖిల్ బాగా మేకోవర్ చేసుకున్నా.. స్టోరీ బాగోలేకపోవడంతో ఫ్లాప్ అయిందని గుర్తు చేస్తున్నారు. ఈసారి.. సరైన మేకోవర్.. అంతకుమించిన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని సూచిస్తున్నారు. మరి అఖిల్ కొత్త మూవీ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.