అఖిల్ కోసం అతడా? ఇతడా?
అయితే ప్రీతక్, విక్రాంత్ ఇద్దరు కూడా అఖిల్ కు సమ ఉజ్జీలే. ఏ ఒక్కరూ తీసేయాల్సిన ఆర్టిస్టులు కాదు. మరి అఖిల్ ని ఢీ కొట్టే ఛాన్స్ ఇద్దరిలో ఎవరిని వరిస్తుందో చూడాలి.
By: Tupaki Desk | 3 Jan 2025 7:30 AM GMTఅక్కినేని వారసుడు అఖిల్ ఎట్టకేలకు 2025 లో కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 'వినరో భాగ్యము విష్ణు కథ'తో సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు మురళీ కృష్ణకు అఖిల్ చాన్స్ ఇచ్చి చేస్తోన్న చిత్రమిది. ప్రస్తు తం ఈప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. 'లెనిన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేసారు. అఖిల్-శ్రీలీల జోడీ ఆన్ స్క్రీన్ పై మరింత అందంగా ఉంటుందని మంచి బజ్ క్రియేట్ అవుతుంది.
శ్రీలీల ఎంట్రీ అన్నది ప్రాజెక్ట్ కి పాజిటివ్ సైన్ గా కనిపిస్తుంది. 'లెనిన్' అని టైటిల్ ని బట్టి చూస్తే భారీ యాక్షన్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్ పాత్రపై ఆసక్తి నెలకొంది. దీంతో ఇద్దరు నటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. '1992 స్కామ్' తో సంచలనం అయిన ప్రతీక్ గాంధీ అయితే అఖిల్ కి ధీటుగా ఉంటాడని కొంత మంది భావిస్తుంటే? కోలీవుడ్ నటుడు విక్రాంత్ ని తీసుకుంటే బాగుంటుందని మరికొంత మంది అభిప్రా యపడుతున్నట్లు లీకులందుతున్నాయి.
ఈ విషయంలో మేకర్స్ మధ్యన తర్జన భర్జన నడుస్తోంది. అయితే ప్రీతక్, విక్రాంత్ ఇద్దరు కూడా అఖిల్ కు సమ ఉజ్జీలే. ఏ ఒక్కరూ తీసేయాల్సిన ఆర్టిస్టులు కాదు. మరి అఖిల్ ని ఢీ కొట్టే ఛాన్స్ ఇద్దరిలో ఎవరిని వరిస్తుందో చూడాలి. అయితే ప్రతీక్ గాంధీ బాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో అతడు అఖిల్ సినిమాకు అడిగిన విధంగా డేట్లు కేటాయించడం కష్టమనే మాట వినిపిస్తుంది. కోలీవుడ్ నటుడు విక్రాంత్ తో అయితే ఆసమస్య లేదు.
ప్రస్తుతం తమిళ్ లో పెద్దగా సినిమాలేవి చేయలేదు. అధికారికంగా 'ది కిల్లర్ మ్యాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది తప్ప అధికారికంగా మరో ప్రాజెక్ట్ లేదు. ప్రతీక్ గాంధీ మాత్రం సినిమాలతో పాటు , వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అతడు గనుక తీసుకుంటే భారీగా పారితోషికం కూడా చెల్లించాల్సి ఉంటుంది. తాను ఇచ్చిన డేట్లు ప్రకారం షూటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొన్ని కండీషన్లు ప్రతీక్ గాంధీ నుంచి తప్పవు. మరి మేకర్స్ మనసులో ఏముందో తెలియాలి.