Begin typing your search above and press return to search.

అన్నయ్య పెళ్లి… అఖిల్ విజిల్ వైబ్!

అక్కినేని నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగింది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 4:38 AM GMT
అన్నయ్య పెళ్లి… అఖిల్ విజిల్ వైబ్!
X

అక్కినేని నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగింది. వారి పెళ్ళికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. వివాహ సమయంలో కుటుంబం అందరూ సందడి చేశారు. అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ పెళ్లి పెద్దలుగా దగ్గరుండి ఈ వివాహం చేశారు.

ఇదిలా ఉంటే నాగ చైతన్య, శోభిత మెడలో మూడు ముళ్ళు వేసే ఘట్టంకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ చైతన్య మూడు ముళ్ళు వేసే సమయంలో శోభిత చాలా నిండైన సంతోషంతో ఆ వీడియోలో కనిపించింది. అలాగే నాగ చైతన్య అత్తయ్యలు అందరూ దగ్గరుండి అతన్ని ఆటపట్టించారు. అఖిల్ కూడా విజిల్స్ వేస్తూ సందడి చేస్తున్నాడు. వెంకటేష్ సైతం ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేశారు.

ముఖ్యంగా అఖిల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. విజిల్స్ వేస్తూ హై వోల్టేజ్ వైబ్ క్రియేట్ చేశాడు. ఓ వైపు వేదమంత్రాలు నడుమ చైతన్య శోభిత మెడలో తాళి కడుతూ ఉండగా అఖిల్ చాలా హుషారుగా విజిల్స్ వేశాడు. ఈ వీడియోని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి కొత్తజంటకి విషెస్ చెబుతున్నారు. అలాగే ఇండస్ట్రీ సెలబ్రెటీలు కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ నూతన వధూవరులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగ చైతన్య పెళ్లి తంతు ఓ వైపు నడుస్తూ ఉండగానే అఖిల్ కూడా తాను ప్రేమించిన అమ్మాయితోఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.

వచ్చే ఏడాది అఖిల్ వివాహం ఉంటుందని నాగార్జున ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య, శోభిత వివాహ వేడుకకి ఇండస్ట్రీ నుంచి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి పెళ్ళికి అటెండ్ అయిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ వివాహ వేడుకకి సంబందించిన గెస్ట్ ల ఫోటోలతో పాటు పెళ్లికి సంబందించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ వివాహం తర్వాత నాగ చైతన్య మరల ‘తండేల్’ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ 2025 మేలో రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ హిట్ టాక్ సొంతం చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.