అఖిల్ పెళ్లి తేది ఎప్పుడు అంటే ?
తాజాగా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని వేద పండితుల సమక్షంలో లగ్న పత్రిక రాయించినట్లు సమాచారం.
By: Tupaki Desk | 20 Jan 2025 7:00 AM GMTఅక్కినేని అఖిల్ పెళ్లికి ముహూర్తం పెట్టేసారా? పెళ్లి తేదీ ఫిక్సై పోయిందా? వేసవి ముంగిటే పెళ్లి భాజాలు మోగించబోతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే అఖిల్ నిశ్చితార్దం ముంబైకి చెందిన జైనబ్ రవ్జీతో జరిగిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జోడీ పెద్దలను ఒప్పించి వివాహానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నిశ్చితార్దం జరిగింది.
తాజాగా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని వేద పండితుల సమక్షంలో లగ్న పత్రిక రాయించినట్లు సమాచారం. మార్చి 24వ తేదీని అఖిల్ -జైనబ్ లో పెళ్లి గ్రాండ్ గా జరగబోతుందని తెలుస్తోంది. అందుకు హైదరాబాద్ వేదిక కాబోతుంది. ఈ పెళ్లిని గ్రాండ్ గా నిర్వహించాలని అక్కినేని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని తరతరాలు చెప్పుకునేలా ఈ వివాహాన్ని ప్లాన్ చేస్తున్నారట.
నాగార్జున ఇంట పెళ్లంటే? సెలబ్రిటీలంతా హాజరవుతారు. టాలీవుడ్ నుంచే కాదు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ నుంచి కూడా దిగుతారు. ఈ వేడుకకు సూపర్ స్టార్లు అంతా హాజరవుతారు. అలాగే నాగార్జున కు అప్పటి హీరోయిన్లతో ఎంతో స్నేహం ఉంది. వాళ్లందరూ కూడా ఈ వివాహానికి తప్పక హాజరవుతారు. ఇంకా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా అంతా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.
నాగార్జున వియ్యంకుడు కూడా పెద్ద వ్యాపార వేత్త . ప్రత్యేకంగా వియ్యంకుడు నాగార్జునకు మంచి స్నేహితుడు కూడా. ఈ నేపథ్యంలో అటు వైపు నుంచి కూడా చాలా మంది అతిధులు హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఈ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుంది? అన్నది చూడాలి. ఇటీవలే నాగచైతన్య-శోభిత వివాహం నిరాడం బరంగా జరిగిన సంగతి తెలిసిందే.