Begin typing your search above and press return to search.

అఖిల్ ని విరూపాక్ష లాక్ చేస్తున్నాడా?

'ఏజెంట్' దెబ్బ‌కి అఖిల్ సైలెంట్ అయిపోయాడు. మ‌ళ్లీ ఎలాంటి సినిమా చేయాలి? ఏ ద‌ర్శ‌కుడితో ప‌నిచే యాలో? నాకు హిట్ ఇచ్చేది ఎవ‌రూ? అంటూ అర్దంకానీ డైల‌మాలో ప‌డిపోయాడు

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:30 PM GMT
అఖిల్ ని విరూపాక్ష లాక్ చేస్తున్నాడా?
X

'ఏజెంట్' దెబ్బ‌కి అఖిల్ సైలెంట్ అయిపోయాడు. మ‌ళ్లీ ఎలాంటి సినిమా చేయాలి? ఏ ద‌ర్శ‌కుడితో ప‌నిచే యాలో? నాకు హిట్ ఇచ్చేది ఎవ‌రూ? అంటూ అర్దంకానీ డైల‌మాలో ప‌డిపోయాడు. 'మోస్ట్ ఎలిజిబుల్' బ్యాచ్ ల‌ర్' తో విజ‌యం ద‌క్కినా...ఆ స‌క్సెస్ ని త‌దుప‌రి కొన‌సాగించ‌లేక‌పోయాడు.' ఏజెంట్' ప‌రాజ‌యం అఖిల్ వేగాన్ని ఒక్క‌సారిగా త‌గ్గించింది. తాను తీసుకుంటోన్న స్వీయా నిర్ణ‌యాలు క‌రెక్టేనా? అని తీవ్ర ఆలోచ‌న‌లోనూ ప‌డ్డాడు.

ఈ నేప‌థ్యంలో త‌న‌వైపు నుంచి త‌ప్పు ఎక్క‌డ జ‌రుగుతుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మ‌ళ్లీ అలాంటి త‌ప్పిదాలు దొర్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డేలా చూసుకుంటున్నాడు. అఖిల్ హీరోగా తాను అనుకున్న ఎక్స్ ప‌క్టేష‌న్ రీచ్ కాన‌ప్ప‌టికీ అందుకునే ప్ర‌య‌త్నం మాత్రం చాలా సీరియ‌స్ గానే చేస్తున్నాడు. ఈ ప్రాస‌స్ లో ఎలాంటి బేధాలు చూడ‌కుండా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన అన్ని ర‌కాల క‌థ‌లు వింటున్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది.

ఇటీవ‌లే అఖిల్ కి 'విరూపాక్ష' ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు ఓ క‌థ చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. అఖిల్ కి ఆస్టోరీ న‌చ్చిందా? లేదా? అన్న‌ది తెలియదుగానీ! కార్తీక్ మాత్రం త‌న ప‌ని నూరుశాతం ప‌క్కాగా పూర్తిచేసి వ‌చ్చాడుట‌. మ‌రి అఖిల్ ఎస్ చెబుతాడా? నో అంటాడా? అన్న‌ది చూడాలి. ఇక కార్తీక్ దండు ఇటీవ‌లే విరూపాక్ష‌తో భారీ విజయం అందుకున్నాడు. సాయితేజ్ ని తొలిసారి ఈ విజ‌యంతో 100 కోట్ల క్ల‌బ్ లో చేర్చాడు.

ఇది కార్తీక్ కి రెండ‌వ సినిమా. అంత‌కు ముందు ఏడేళ్ల క్రితం 'భం భోలేనాధ్' అనే సినిమా చేసాడు. ఇది పెద్ద‌గా ఆడ‌లేదు. అలాగే 'జ‌వాన్'..'కార్తికేయ' లాంటి సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసాడు. విరూపాక్ష విజ‌యంతో మంచి పేరొచ్చింది. దీంతో అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. కానీ హీరోలంతా బిజీగా ఉన్నారు. త‌న సినిమాకి డేట్లు కేటాయించాలి అంటే రెండేళ్లు అగ‌మంటున్నారు. ఈనేప‌థ్యంలోనే ఖాళీగా ఉన్న అఖిల్ కి స్టోరీ నేరేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి అఖిల్ ఈ అవ‌కాశాల‌న్ని ఎలా భావిస్తున్నాడు? అన్న‌ది తెలియాలి.