Begin typing your search above and press return to search.

బాబు ఇలా సైలెంట్ గా ఉంటే సరిపోదంటున్న ఫ్యాన్స్..!

ఐతే చేసిన 3 సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం కాగా ఫోర్త్ మూవీగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో సక్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   23 July 2024 2:45 AM GMT
బాబు ఇలా సైలెంట్ గా ఉంటే సరిపోదంటున్న ఫ్యాన్స్..!
X

స్టార్ లెగసీ నుంచి వచ్చిన హీరోల మీద అభిమానుల అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఐతే వాటికి తగినట్టుగానే కెరీర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి 3వ తరం నటుడిగా వచ్చిన అఖిల్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడి ఉన్నాడు. అఖిల్ అనే భారీ ప్రాజెక్ట్ తో అక్కినేని యువ హీరో అఖిల్ కెరీర్ మొదలవగా ఆ తర్వాత మిస్టర్ మజ్ను, హెలో సినిమాలు చేశాడు. ఐతే చేసిన 3 సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం కాగా ఫోర్త్ మూవీగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో సక్సెస్ అందుకున్నాడు.

ఆ సినిమా సక్సెస్ లో హీరోయిన్ పూజా హెగ్దేకే ఎక్కువ మార్కులు పడ్డా ఎలాగోలా కెరీర్ లో ఒక సక్సెస్ కొట్టాడు అఖిల్. ఇక ఆ తర్వాత ఏజెంట్ అంటూ యాక్షన్ సినిమా చేశాడు. స్పై మూవీగా వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది. ఐతే అఖిల్ ఏజెంట్ వచ్చి ఏడాది దాటి పోయింది అయినా కూడా తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

అఖిల్ బాబు సినిమా అప్డేట్ ఇవ్వకుండా ఇలా సైలెంట్ గా ఉండటం ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తుంది. అఖిల్ నెక్స్ట్ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని టాక్. ఐతే కథా చర్చలు ముగిసి ప్రాజెక్ట్ ఫైనల్ అయినా కూడా ఎందుకో ఆ సినిమా గురించి అనౌన్స్ చేయడం జరగట్లేదు. అఖిల్ సినిమా విషయంలో అసలేం జరుగుతుంది అన్నది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున, నాగ చైతన్య విషయంలో టెన్షన్ లేదు కానీ ఎందుకో అఖిల్ విషయంలో కాస్త కంగారుగా ఉన్నారు.

అఖిల్ నెక్స్ట్ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి అఖిల్ లేట్ కి రీజన్ ఏంటన్నది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. ఐతే అఖిల్ లుక్స్ మాత్రం షాక్ ఇస్తుండగా ఈసారి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు కాబట్టే ఇలా లేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అఖిల్ లాంటి యువ హీరో ఇలా సినిమా సినిమాకు ఇంత గ్యాప్ తీసుకుంటే కెరీర్ మీద కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు.