Begin typing your search above and press return to search.

అఖిల్ సినిమా లేట్ ఎక్కడ జరుగుతుంది..?

లాస్ట్ ఇయర్ ఏజెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ ఆ సినిమా రిజల్ట్ డిజప్పాయింట్ చేయడంతో చాలా నిరుత్సాహ పడ్డాడు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 3:51 AM GMT
అఖిల్ సినిమా లేట్ ఎక్కడ జరుగుతుంది..?
X

అక్కినేని అఖిల్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటే అఖిల్ మాత్రం సినిమా గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఏజెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ ఆ సినిమా రిజల్ట్ డిజప్పాయింట్ చేయడంతో చాలా నిరుత్సాహ పడ్డాడు. ఐతే కెరీర్ లో హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువ ఫేస్ చేసిన అఖిల్ తనను తాను మళ్లీ నెక్స్ట్ సినిమాకు రెడీ చేసుకునేందుకు టైం తీసుకున్నాడు.

ఐతే ఈమధ్య అఖిల్ లుక్ చూస్తుంటే అదేదో సినిమాకు మేకోవర్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా అనౌన్స్ చేసి ఎంత టైం తీసుకున్నా బాగుంటుంది కానీ ఇలా సైలెంట్ గా ఉంటే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. ఓ పక్క నాగ చైతన్య సినిమా వెంట సినిమా చేస్తూ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంటే అఖిల్ మాత్రం ఆ ప్రయత్నాల్లో వెనకపడి ఉన్నాడు.

కాస్త లేట్ అయినా కూడా అక్కినేని లెగసీని స్టార్ డం ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సత్తా అఖిల్ కే ఉందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అఖిల్ ఫైట్స్, యాక్షన్, డాన్స్ వీటిలో పర్ఫెక్షన్ ఫ్యాన్స్ కి ఆ నమ్మకాన్ని ఇచ్చింది. ఐతే ఇవన్నీ ఉన్నా కూడా అఖిల్ కి హిట్ దక్కట్లేదు. కెరీర్ లో బ్యాచిలర్ అనే సినిమా తప్ప మిగతా సినిమాలు నాలుగు సక్సెస్ అవ్వలేదు. అందుకే ఈసారి హిట్ టార్గెట్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయిన అఖిల్ పర్ఫెక్ట్ కాంబో సెట్ అయ్యే దాకా వెయిట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అఖిల్ తో హోంబలె ప్రొడక్షన్స్ ఒక భారీ సినిమా ప్లానింగ్ లో ఉందని టాక్. ఐతే ఈ సినిమా విషయంలో గత ఆరు నెలలుగా మీడియాలో చర్చలు జరుగుతున్నా సినిమా గురించి ఎలాంటి క్లూస్ బయటకు రావట్లేదు. అక్కినేని కాంపౌండ్ కూడా అఖిల్ నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి విషయాలను చెప్పట్లేదు. మరి అఖిల్ నెక్స్ట్ సినిమాపై ఈ సైలెన్స్ ఎందుకో తెలియాల్సి ఉంది. అఖిల్ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటుగా నాగార్జునకు కూడా టెన్షన్ మొదలైంది. తన సినిమా కన్నా ముందు అఖిల్ సినిమా స్టార్ట్ చేయాలని నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే స్క్రిప్ట్ ఇంకా సినిమా సెలక్షన్ లో కింగ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే అఖిల్ ఇంత లేట్ చేస్తున్నాడని కొందరు భావిస్తున్నారు.