Begin typing your search above and press return to search.

అక్కినేని కాంపౌండ్ లో రవితేజ కథ?

అక్కినేని అఖిల్ కి కెరియర్ పరంగా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. మరోవైపు కింగ్ నాగార్జున మంచి కథలని ఎంపిక చేసుకొని హిట్స్ అందుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 8:30 AM GMT
అక్కినేని కాంపౌండ్ లో రవితేజ కథ?
X

అక్కినేని అఖిల్ కి కెరియర్ పరంగా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. మరోవైపు కింగ్ నాగార్జున మంచి కథలని ఎంపిక చేసుకొని హిట్స్ అందుకుంటున్నారు. నాగ చైతన్య కూడా కొంచెం కొంచెంగా తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోగా చైతన్య ఉన్నారు. తండేల్ సినిమాతో పాన్ ఇండియా జాబితాలోకి అడుగుపెడుతున్నారు. ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో తండేల్ తెరకెక్కుతోంది.

ఈ ఏడాది ఆఖరులో తండేల్ మూవీ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే అఖిల్ 2015లో హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాడు. తన పేరునే టైటిల్ గా పెట్టి వివి వినాయక్ భారీ బడ్జెట్ తో సినిమా చేశారు. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. హీరోగా అఖిల్ 9 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాడు. ఇప్పటి వరకు ఐదు సినిమాలు మాత్రమే చేశాడు.

అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ మాత్రమే సక్సెస్ అయ్యింది. మిగిలినవన్ని కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచాయి. గత ఏడాది రిలీజ్ అయిన ఏజెంట్ మూవీ అయితే అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఏజెంట్ తర్వాత అఖిల్ కొత్త సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. యూవీ క్రియేషన్స్ లో అఖిల్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీకి ప్లానింగ్ జరుగుతోందని టాక్ నడుస్తోంది.

అఖిల్ లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. నెక్స్ట్ సినిమా కోసమే అతను తన లుక్ చేంజ్ చేసుకున్నాడనే మాట వినిపిస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ మూవీని ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ హీరోగా మరో సినిమా కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరంకి వినరో భాగ్యం విష్ణు కథ లాంటి హిట్ ఇచ్చిన కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందంట.

చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాని డైరెక్టర్ కిషోర్ రవితేజతో చేయాలని అనుకున్నారంట. అయితే ఎందుకనో సాధ్యం కాలేదు. దీంతో అక్కినేని కాంపౌండ్ లో కథని నేరేట్ చేసారంట. అఖిల్ హీరోగా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని కింగ్ నాగార్జున డిసైడ్ అయ్యారంట. నాగార్జున, నాగ చైతన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. లెనిన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. మరి ఇది అఫీషియల్ గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.