Begin typing your search above and press return to search.

అఖిల్.. మొత్తానికి వారంతా కోరుకుంటున్నట్లు!

బాలనటుడిగా సిసింద్రీ మూవీలో అలరించిన అఖిల్.. అక్కినేని మూడు తరాలు కూడా కనిపించిన మనంలో క్యామియో రోల్ లో నటించారు.

By:  Tupaki Desk   |   8 July 2024 11:30 PM GMT
అఖిల్.. మొత్తానికి వారంతా కోరుకుంటున్నట్లు!
X

సీనియర్ హీరో, కింగ్ నాగార్జున వారసుడిగా అక్కినేని అఖిల్ టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేసినా సరైన హిట్ అందుకోలేకపోయారు. బాలనటుడిగా సిసింద్రీ మూవీలో అలరించిన అఖిల్.. అక్కినేని మూడు తరాలు కూడా కనిపించిన మనంలో క్యామియో రోల్ లో నటించారు. ఆ తర్వాత 2015లో అఖిల్ మూవీతో హీరోగా మారారు.

కానీ డెబ్యూ మూవీతో అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేకపోయారు. ఆ తర్వాత అఖిల్ చేసిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా విజయం సాధించినా.. హీరోగా మాత్రం అఖిల్ సరైన రీతిలో ఎస్టాబ్లిష్ కాలేకపోయారు. ఆ తర్వాత అఖిల్ ఏజెంట్ మూవీతో గత ఏడాది వచ్చారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం చాలా కష్టపడ్డారు. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఏజెంట్ తర్వాత ఒక్క మూవీ కూడా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. ఆ మధ్య శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. గుబురు గడ్డం, కోర మీసాలు, పొడవాటి జుట్టుతో స్టైలిష్ గా సందడి చేశారు. ఆ పిక్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.

అయితే అఖిల్.. తన నెక్స్ట్ మూవీ కోసమే అలా మేకోవర్ చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై ధీర పేరుతో అయ్యగారి కొత్త సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ కుమార్ అనే ఒక కొత్త డైరెక్టర్ తెరకెక్కించనున్న ఆ సినిమా ఆగస్టులో సెట్స్‌ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఆ సినిమా స్టార్ట్ కాకముందే అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్‌ ను కూడా రీసెంట్ గా లాక్ చేశారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

చిత్తూరు బ్యాక్‌ డ్రాప్‌ లో విలేజ్ డ్రామాగా కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అయితే ఆయన చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన హీరో నాగార్జున.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ పై సినిమాను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే అఖిల్ ను నాగార్జున పట్టించుకోవడం లేదని ఆయన ఫ్యాన్స్ నెట్టింట చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.

అఖిల్ ను గట్టిగా సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున.. అఖిల్ కొత్త మూవీని నిర్మించనున్నారని వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. సరైన హిట్ కొట్టేలా చూడండి నాగ్ సర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఎప్పటి నుంచో అనుకున్న తమ కోరిక నెరవేరుతుందని కామెంట్లు పెడుతున్నారు. మరి అఖిల్.. తన అప్ కమింగ్ సినిమాలతో హిట్ కొడతారో లేదో చూడాలి.