Begin typing your search above and press return to search.

అకీరాను లాంచ్ చేసేది రామ్ చ‌ర‌ణ్‌!

ఇప్ప‌టికే అకీరాను వెంట తిప్పుకుని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వారసుడిగా హైలైట్ చేసిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాలోనే అకీరాని ప‌రిచయం చేసాడు.

By:  Tupaki Desk   |   28 Feb 2025 5:00 PM IST
అకీరాను లాంచ్ చేసేది రామ్ చ‌ర‌ణ్‌!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార‌సుడు అకీరా నంద‌న్ తెరంగేట్రానికి ఏర్పాట్లు మొద‌ల‌య్యాయా? అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇదే ఏడాది? లేదా వ‌చ్చే ఏడాది షురూ చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాచారం మెగాకాంపౌండ్ వ‌ర్గాల నుంచి బ‌లంగా వినిపిస్తుంది. ఇప్ప‌టికే అకీరాను వెంట తిప్పుకుని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వారసుడిగా హైలైట్ చేసిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాలోనే అకీరాని ప‌రిచయం చేసాడు.

దేశ ప్ర‌ధాని నరేంద్ర మోదీకి ఇంట‌ర్ డ్యూస్ చేయ‌డం..అంత‌కు ముందు ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడి ఆశీస్సులు ఇప్పించ‌డం ఇవ‌న్నీ కూడా అకీరా ఎంట్రీకి సంబంధించిన సంకేతాలుగానే నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా లాంచింగ్ ప‌నులు వేగవంత‌మైన‌ట్లు తెలుస్తోంది. అకీరాను లాంచ్ చేసే బాధ్య‌త‌లు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తీసుకున్నాడ‌ని స‌న్నిహితుల స‌మాచారం.





ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ బాధ్య‌త‌లు త‌న‌కే అప్ప‌గించిన‌ట్లు వినిపిస్తుంది. స్టోరీ సెల‌క్ష‌న్, డైరెక్ట‌ర్ ఎంపిక ఇలా ప్ర‌తీది మొద‌టి ఫేజ్ లో రామ్ చ‌ర‌ణ్ చూస్తాడట‌. అటుపై మెగాస్టార్ చిరంజీవికి రిఫ‌ర్ చేస్తారట‌. వాళ్లిద్ద‌రి స్క్రీనింగ్ పూర్త‌యిన త‌ర్వాత చివ‌రిగా ప‌వ‌న్ ముందుకు స్టోరీ వెళ్తుంద‌ని స‌న్నిహితుల నుంచి అందుతోన్న స‌మ‌చారం. అన్న‌య్య‌, అబ్బాయ్ మాట‌ల‌ను ప‌వ‌న్ ఎలాగూ కాద‌న‌డు.

సినిమా నాలెడ్జ్ త‌న‌కంటే ఎక్కువ‌గా వాళ్లిద్ద‌రికే ఉంద‌ని న‌మ్మే వ్య‌క్తి ప‌వ‌న్. పైగా తాను ఉన్న బిజీలో ప‌వ‌న్ ఎలాగూ త‌న‌యుడి కెరీర్ విష‌యంలో శ్ర‌ద్ద తీసుకోలేదు. అంత స‌మ‌యాన్ని కేటాయించ‌లేని ప‌రిస్థితి. ఇవ‌న్నీ ఆలోచించుకునే అకీరాని చ‌ర‌ణ్ చేతుల్లో పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. రామ్ చ‌ర‌ణ్ కు త‌ల్లి రేణు దేశాయ్ ట‌చ్ లో ఉన్నారుట‌. త‌న‌యుడి విష‌యంలో అన్ని అప్ డేట్స్ అడిగి తెలుసుకుంటున్నార‌ని తెలిసింది.