ఉస్తాద్ భగత్ సింగ్ అకీరా నందన్ తోనా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారు? అన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 March 2025 5:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారు? అన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా....డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నెరవేరస్తోన్న నేపథ్యంలో పవన్ ఇక సినిమాలు చేయబోరని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సినిమాల విషయంలో ఆయన ఏమాత్రం ఆసక్తిగా ఉన్నట్లు కూడా కనిపించలేదని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను బట్టి అర్దమవుతుంది.
`హరిహర వీరమల్లు` చిత్రానికి నాలుగు రోజులు డేట్లు కూడా కేటాయించలేని స్థితిలో పవన్ ఉన్నారు.` ఓజీ` షూటింగ్ పరిస్థితి కూడా అదే. ఈ రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ అవ్వాలని. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక మిగతా సినిమాల పరిస్థితి ఆ పెరుమాళ్లకే ఎరుక. ఈ నేపథ్యంలో పవన్ ఇదే ఏడాది వారసుడు అకీరా నందర్ ని వెంట తిప్పడం కూడా ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.
గ్లామర్ పీల్డ్ లో పవన్ లేకపోయినా? వారసుడిని లాంచ్ చేసి అభిమానులను మెప్పించాల్సిన బాధ్యత అతగాడికి అప్పగించే అవకాశాలున్నాయని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అకీరానందన్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. అకీరా నందన్ ఎంట్రీ `ఉస్తాద్ భగత్ సింగ్` తో జరుగుతుందనే వార్త బయటకు వచ్చింది. ఇటీవలే పవన్ హరీష్ శంకర్ ని పిలిచి అకీరా గురించి వివరించి నట్లు సన్నిహితుల నుంచి లీకైంది.
తాను నటించాల్సిన చిత్రంలో అకీరా నటిస్తే ఎలా ఉంటుందో ఆలోచించమని హరీష్ కి పీకే సలహా ఇచ్చారుట. అందుకు హరీష్ కూడా ఆలోచించి చెబుతానన్నాడుట. మరి ఇదే నిజమైతే అభిమానులకు పండగే. అకీరా ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అకీరా హైట్....బాడీ లాంగ్వేజ్ చూసి పక్కా హీరో మెటీరియల్ అని తేలిపోయింది. తండ్రి ఇమేజ్ తో అకీరా ఎంట్రీ ఇస్తే పెద్ద హీరో అవుతాడని అభిమానులు బలంగా విశ్వశిస్తున్నారు.