అకిరా నందన్ హై వోల్టేజ్ టీజర్.. ఏం హైప్ రా బాబు!
రీసెంట్ గా తండ్రితో కలిసి దేవాలయాల సందర్శన యాత్రలో పాల్గొన్న అఖిరా నిండైన గెడ్డంతో పవర్ఫుల్ గా దర్శనమిచ్చాడు.
By: Tupaki Desk | 13 Feb 2025 8:35 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎందరో వారసులు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండదని తెలుస్తోంది. 20 ఏళ్ల వయసులోనే అతని కటౌట్ బాక్సాఫీస్‌కి హెచ్చరికగా కనిపిస్తోంది. వెండితెరపై కనిపిస్తే మామూలు హైట్స్ లోకి వెళ్లడని స్పష్టమవుతోంది.
బయట ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ అతన్ని చూడటానికి ఎగబడుతున్నారు. రీసెంట్ గా తండ్రితో కలిసి దేవాలయాల సందర్శన యాత్రలో పాల్గొన్న అఖిరా నిండైన గెడ్డంతో పవర్ఫుల్ గా దర్శనమిచ్చాడు. ఇక సోషల్ మీడియాలో అతని ఫోటోలకు వచ్చే రెస్పాన్స్ అసాధారణం. ఇక తండ్రి పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, జనసేన నేతగా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకుంటున్నారు.
అలాంటి పవర్‌ఫుల్ లీడర్ నుంచి వచ్చే వారసుడు కావడంతో పాన్ ఇండియా రేంజ్‌లో కూడా అతని పై ఫోకస్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అకిరా నందన్‌కు ఇస్తున్న ఎలివేషన్స్ కూడా మామూలుగా లేవు. సోషల్ మీడియాలో అతని వీడియోలు, ఫోటోలు సినిమాల టీజర్స్‌కి మించి పవర్‌ఫుల్‌గా తయారవుతున్నాయి.
ఇటీవల, ఒక ఫ్యాన్ ప్రభాస్ "మిర్చి" సినిమాలోని డైలాగ్‌తో అకిరా విజువల్స్‌ను హైలైట్ చేస్తూ ఎడిట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. హీరోను ఎలివేట్ చేస్తూ చెప్పే ప్రతీ డైలాగ్ కూడా అకిరాకు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అకిరా నందన్‌ను మొదట ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియదు కానీ, ఆ డైరెక్టర్ కు అకిరా ఎంట్రీ మూవీనే కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. గతంలో అతను విదేశాల్లో నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మార్షల్ ఆర్ట్స్, డాన్స్‌లో ప్రత్యేక శిక్షణతో పాటు, మ్యూజిక్ పైన కూడా మంచి అవగాహన కలిగి ఉన్నాడు. ఒక హీరోకు అవసరమైన అన్ని రకాల ఎలిమెంట్స్ అతనిలో ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అకిరా వయస్సు 20 సంవత్సరాలు. ఇక అతని మొదటి సినిమాకి ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు.