Begin typing your search above and press return to search.

కాశీలో మాస్క్‌తో అకీరా... తండ్రికి తగ్గ తనయుడు

రేణు దేశాయ్ గత రెండు రోజుల నుంచి కాశీ యాత్రలో ఉన్నారు. ఆమె తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కాశీలో పర్యటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 7:48 AM GMT
కాశీలో మాస్క్‌తో అకీరా... తండ్రికి తగ్గ తనయుడు
X

రేణు దేశాయ్ గత రెండు రోజుల నుంచి కాశీ యాత్రలో ఉన్నారు. ఆమె తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కాశీలో పర్యటిస్తున్నారు. కాశీ యాత్ర సందర్భంగా పిల్లలతో కలిసి రేణు దేశాయ్ ఆటోలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. రేణు దేశాయ్ షేర్‌ చేసిన ఈ ఫోటోలను, వీడియోలను పవన్‌ అభిమానులు తెగ షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పిల్లలు అయ్యి ఉండి అకీరా, ఆద్యలు ఆటో రిక్షాలో తిరగడం వారి సింప్లిసిటీకి నిదర్శనం అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆధ్య వీడియో మొదట వైరల్‌ అయ్యింది. పవన్ కి నిజమైన వారసురాలు, తండ్రికి తగ్గ కూతురు అంటూ ఆద్యపై పలువురు ప్రశంసలు చేశారు.

ఆద్య వీడియోతో పాటు అకీరా వీడియోను సోషల్‌ మీడియా ద్వారా రేణు దేశాయ్ షేర్ చేసింది. అకీరా సైతం ఆటో రిక్షాలో సింపుల్‌ వ్యక్తిగా ప్రయాణం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. వారణాసిలోనూ పవన్‌ అభిమానులు ఉంటారు, అకీరాను గుర్తు పట్టే వారు ఉంటారు. అందుకే అకీరా అక్కడ సైతం మాస్క్‌ ధరించి ఆటో రిక్షాలో పర్యటిస్తున్నాడు. పవన్‌ క్రేజ్ ఏ పాటిదో అందరికీ తెలిసిందే. అందుకే ఆయన తనయుడు అకీరా సైతం అదే స్తాయిలో గుర్తింపు, స్టార్‌డం దక్కించుకున్నాడు. హీరోగా పరిచయం కాకుండానే అకీరాకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. అందుకే కాశీకి వెళ్లినా అకీరాను చాలా మంది గుర్తు పడతారు, అందుకే మాస్క్‌ ధరించాడు.

అకీరా, ఆద్యలు సింపుల్‌గా కనిపించడం మాత్రమే కాకుండా వారి జీవన శైలి సైతం చాలా సింపుల్‌గా ఉంటుంది అంటూ ఈ ఫోటోలు, వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. పవన్‌ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంత పెద్ద స్టార్‌ అయినా చాలా సింపుల్‌గా ఉంటారు, అంతే కాకుండా చాలా సింపుల్‌గా జీవితాన్ని సాగిస్తారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా పవన్‌ కళ్యాణ్ సింపుల్‌గా తన పని తాను చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నారు. ఎక్కడా ఆడంబరాలకు వెళ్లకుండా సింపుల్‌గా జీవితాన్ని సాగిస్తున్నారు అంటూ ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.

అకీరా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని మెగా ఫ్యాన్స్‌తో పాటు చాలా మంది నమ్మకంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పవన్‌ కానీ, రేణు దేశాయ్‌ కానీ అకీరా సినిమా ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం కోసం గ్రౌండ్‌ వర్క్ జరుగుతుంది. ఆ మధ్య పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అకీరా నందన్‌ ఢిల్లీ పెద్దలను తండ్రితో కలిసి కలవడం జరిగింది. అప్పటి ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఇక ఆధ్య ఇటీవల పవన్‌ కళ్యాణ్‌తో కలిసి తిరుపతి వెళ్లడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.