Begin typing your search above and press return to search.

అకీరా నందన్ రియ‌ల్ గడ్డ‌మేనా?

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఏదైనా ఉంది అంటే అది క‌చ్ఛితంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సుడు అకీరా నంద‌న్ డెబ్యూనే.

By:  Tupaki Desk   |   14 Feb 2025 3:00 AM GMT
అకీరా నందన్ రియ‌ల్ గడ్డ‌మేనా?
X

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఏదైనా ఉంది అంటే అది క‌చ్ఛితంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సుడు అకీరా నంద‌న్ డెబ్యూనే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినీఎంట్రీ కోసం మెగా ఫ్యామిలీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున అందరి దృష్టి అతడిపైనే.


అకీరా సినీఎంట్రీ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న‌లేవీ లేక‌పోయినా.. ఛామింగ్ బోయ్ ప‌బ్లిక్ వేదిక‌ల‌పై అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉన్నాడు. ఆరున్న‌ర అడుగుల బుల్లెట్టులా క‌నిపించే అకీరా ఒడ్డు పొడుగు ఛామింగ్ అప్పియ‌రెన్స్ కి ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ప్ర‌భాస్, రానా, వ‌రుణ్ తేజ్ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ లో ఎత్త‌యిన హీరో అత‌డే. అకీరా త్వ‌ర‌లోనే సినీఎంట్రీ ఇస్తున్నాడని వ‌చ్చిన వార్త‌ల‌న్నీ నిజాలు కాలేదు. కానీ అత‌డు ఎంట్రీ ఇచ్చే టైమ్ వ‌చ్చేసింద‌న్న‌ది ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ భావ‌న‌.


ఇటీవల అకీరా నందన్ గుబురు గ‌డ్డంతో స్టైలిష్ అవ‌తార్‌లో కనిపించాడు. ఇది అభిమానులలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. తన తండ్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి కేరళ, తమిళనాడు అంతటా అకీరా నంద‌న్ ఆలయాల‌ పర్యటనలో ఉన్నారు. ఈ ఇద్ద‌రూ లేటెస్టుగా తిరువనంతపురం సమీపంలోని శ్రీ పరశురామ ఆలయాన్ని సందర్శించారు. స్పాట్ నుంచి విడుద‌లైన ఫోటోల్లో అకీరా బాగా న‌ల్ల‌ని గుబురు గ‌డ్డంతో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అభిమానులు యంగ్ బోయ్ అద్భుతమైన రూపాన్ని అభినందిస్తున్నారు. ఈ కొత్త రూపం అకీరా సినీ ఎంట్రీ గురించి చర్చలకు మరింత ఆజ్యం పోసింది.


ఒక సెక్ష‌న్ డిస్క‌ష‌న్స్‌లో అకీరాకు ఇంకా అంత వ‌య‌సు ఉందా? వయసు తక్కువే అయినా అంత ఫుల్ గడ్డం ఎలా పాజిబుల్‌? అని డిస్కషన్ చేస్తున్నారు. ఇది డెబ్యూ సినిమా కోసం పెంచాడా లేక పెట్టుకున్నాడా? అని కొంద‌రు సందేహిస్తున్నారు. అయితే ఇలా పెట్టుడు గ‌డ్డంతో ఆల‌యాల సంద‌ర్శ‌న‌కు వెళ్లాల్సిన అవస‌రం ఏం ఉంటుంది? అని కూడా త‌న అభిమానులు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.