Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ చరిష్మా.. అకిరా ఇలా మ్యాచ్ చేయగలడా..

ఖుషి, వకీల్ సాబ్, జానీ సినిమాలలోని స్టిల్స్ కి అకీరా పేస్ ని మ్యాప్ చేసి వీడియో క్రియేట్ చేశారు.

By:  Tupaki Desk   |   7 July 2024 5:01 AM GMT
పవర్ స్టార్ చరిష్మా.. అకిరా ఇలా మ్యాచ్ చేయగలడా..
X

డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్నారు. మంత్రిగా వివిధ శాఖలని నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. పాలకుడుగా ఆయన పనితీరు అందరిని ఆకట్టుకుంటుంది. ప్రజల్లోకి బాగా వెళ్తోంది. ఇదే హవా కొనసాగితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావడం అసాధ్యం అవుతుంది. ప్రస్తుతం అయితే కమిట్ అయిన మూడు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి సినిమాలకి పవన్ స్వస్తి చెప్పే ఛాన్స్ ఉందంట.

ఈ ప్రాజెక్ట్స్ కూడా మూడు, నాలుగు నెలల తర్వాతనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ బయట ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎన్నికలలో జనసేన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ తో పాటు అకిరా నందన్ ఉన్నారు. చంద్రబాబు, పీఎం నరేంద్రమోడీని కలుసుకున్నాడు. యువకుడిగా మారిన అకిరా నందన్ పవర్ స్టార్ అభిమానులకి హీరో మెటీరియల్ గా కనిపిస్తున్నాడు.

అందుకే త్వరలో అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే జూనియర్ పవర్ స్టార్ అంటూ అకిరాని కీర్తించడం మొదలుపెట్టారు. కొందరైతే అకిరాని AI ఉపయోగించి పవర్ స్టార్ మేనరిజమ్, స్టైల్, ఆటిట్యూడ్ ని అకిరాలో కూడా చూపిస్తూ ఇమేజ్ లు క్రియేట్ చేస్తున్నారు. ఓ అభిమాని పవన్ కళ్యాణ్ సినిమాలలోని స్టిల్స్ అకిరా పేస్ ని మార్ఫ్ చేసి వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఖుషి, వకీల్ సాబ్, జానీ సినిమాలలోని స్టిల్స్ కి అకీరా పేస్ ని మ్యాప్ చేసి వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు అద్భుతంగా ఉందని అభివర్ణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చరిష్మాని అకిరా నందన్ మ్యాచ్ చేస్తాడనే మాట వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ లో ఉండే ఆటిట్యూడ్, మేనరిజమ్స్ ని ఎంత వరకు ఒడిసిపట్టుకుని ప్రేక్షకులకి కనెక్ట్ అవుతాడనేది చూడాల్సి ఉంది. అభిమానులు అయితే అకిరా నందన్ ని హీరోగా చూడాలని అనుకుంటున్నారు.

ట్రై చేస్తే మరో రెండేళ్లలో హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడానికి కావాల్సిన ప్లాట్ ఫామ్ అకిరాకి రెడీ అయిపోతుంది. మెగా కాంపౌండ్ నుంచి హీరో అంటే లాంచ్ చేయడానికి పెద్ద నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. మరి అకిరా తన ఇష్టాలు మార్చుకొని హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ గానే కెరియర్ బిల్డ్ చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.