Begin typing your search above and press return to search.

అకిరా నందన్.. యాక్షన్ సర్ ప్రైజ్

తాజాగా ఒక షార్ట్ వీడియోని రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందులో అకిరా నందన్ కర్రసాము చేస్తుండటం విశేషం. ఈ వీడియోకి సమురాయ్ బాయ్ అనే క్యాప్షన్ కూడా రేణుదేశాయ్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   11 May 2024 4:20 AM GMT
అకిరా నందన్.. యాక్షన్ సర్ ప్రైజ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ అంటూ ఓన్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లలో అకిరా నందన్ రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. టీనేజ్ లో ఉన్న అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని పవర్ స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది ఇప్పుడే చెప్పలేని విషయం.

అకిరా నందన్ కి యాక్టింగ్ చేయాలనే ఇంటరెస్ట్ లేదని గతంలో రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. అతనికి మ్యూజిక్ అంటే ఇష్టం అని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడని కూడా చెప్పుకొచ్చారు. అలాగే అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక షార్ట్ ఫిలిం చేసి టాలెంట్ చూపించాడు. మెగా ఫ్యామిలీ ఈవెంట్ లో కూడా యానిమల్ లోని ట్యూన్ ప్లే చేసిన వీడియో బయటకొచ్చి వైరల్ అయ్యింది.

దీంతో అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అకిరా హీరో అవ్వాలని అనుకుంటే ఆ విషయాన్ని నేనే ముందుగా చెబుతానని రేణుదేశాయ్ గతంలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఆమె ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా తన ఇద్దరి పిల్లలకి సంబందించిన యాక్టివిటీస్ ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఒక షార్ట్ వీడియోని రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందులో అకిరా నందన్ కర్రసాము చేస్తుండటం విశేషం. ఈ వీడియోకి సమురాయ్ బాయ్ అనే క్యాప్షన్ కూడా రేణుదేశాయ్ ఇచ్చారు. ఈ వీడియో ద్వారా పరోక్షంగా ఆమె అకిరా నందన్ హీరో అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాడనే హింట్ ఇస్తున్నట్లు ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వీడియో నిడివి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్న కర్రసాములో అకిరా నందన్ మంచి ప్రావీణ్యం సంపాదించాడని అర్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ కూడా టీనేజ్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. పవర్ స్టార్ తరహాలోనే అకిరా కూడా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సాధిస్తున్నాడు అంటే భవిష్యత్తులో హీరో అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఒక వేళ అకిరా నందన్ ని హీరోగా చూడాలని అనుకున్న కనీసం 5 ఏళ్ళకి పైనే పడుతుంది. ప్రస్తుతం ఇంకా అతను వయస్సు 20 ఏళ్ళు మాత్రమే. మరి తండ్రి వారసత్వాన్ని అందుకొని సిల్వర్ స్క్రీన్ పై అకిరా నందన్ హీరోగా మెరుస్తాడేమో చూడాలి.