కల్కి కోసం అకిరా నందన్.. పరుగో పరుగు..
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 AD' చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ తో విడుదలైంది.
By: Tupaki Desk | 27 Jun 2024 7:28 AM GMTనాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 AD' చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ తో విడుదలైంది. తొలి రోజునే సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల ఆదరణతో థియేటర్స్ హౌస్ ఫుల్ గా మారాయి. అమెరికా సహా ఇతర దేశాల్లో కూడా ప్రీమియర్స్ పడ్డాయి, అవి సైతం సూపర్ హిట్ టాక్ ను తెచ్చాయి.
ఇక సినిమా విడుదల రోజునా, ఒక ఆసక్తికరమైన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్, ప్రభాస్ అభిమాని తరహాలో 'కల్కి' టీ-షర్ట్ ధరించి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రసాద్ మల్టీప్లెక్స్ కి వచ్చాడు. ఫ్యాన్స్ ఎగబడడంతో అతను పరుగులు పెట్టారు. అతనితో పాటు స్నేహితులు, అలాగే తల్లి రేణు దేశాయ్ కూడా సినిమాకు వచ్చారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపింది. అభిమానులు "అకీరా కూడా మనోడే" అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
అకిరా టాలీవుడ్ కు సంబంధించిన ప్రతీ పెద్ద సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్ అయినా కూడా థియేటర్స్ కు వస్తున్నాడు. ఇక ఇప్పుడు కల్కి సినిమాకు రావడం మరింత హైలెట్ గా నిలిచింది. భవిష్యత్తులో అకిరా హీరోగా మారడం కాయంగా కనిపోస్తోంది. ఎందుకంటే అతను సినిమాలను బాగా ఫాలో అవుతున్నాడు. మాస్ ఆడియెన్స్ పల్స్ తెలుసుకునేందుకు డైరెక్ట్ గా థియేటర్స్ వరకు వెళుతున్నట్లు అనిపిస్తుంది.
మరి అకిరా నందన్ మొదటి సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి దిగ్గజ తారాగణం ముఖ్య పాత్రలలో నటించడం మరో ప్రధాన ఆకర్షణ. వీరితో పాటు పలు స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు కూడా అతిథి పాత్రలలో మెరిశారు. అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.
సినిమా విడుదలకు ముందే టికెట్ రేట్లు పెంచడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి అనుమతులు పొందడం జరిగింది. అయినప్పటికీ, టికెట్లు దొరకకపోవడం గమనార్హం. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, సైంటిఫిక్ ఫిక్షన్, మైథలాజికల్ కథనం, నటీనటుల ప్రదర్శనలు ప్రతీ ఒక్కరికీ ఆకట్టుకునే విధంగా ఉండటం ప్రధాన కారణం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ పాత్రలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి.
'కల్కి 2898 AD' సినిమాను చూసిన ప్రేక్షకులు కథనంలో ఉన్న కొత్తదనం, ప్రతీ సన్నివేశంలో ఉన్న గ్రాండియర్, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ప్రథమ భాగం కాస్త నెమ్మదిగా నడుస్తున్నప్పటికీ, రెండవ భాగం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రత్యేకంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆద్యంతం ఉర్రూతలూగిస్తాయి. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం.