Begin typing your search above and press return to search.

అకిరా.. అందరినీ మించిపోయే కటౌట్ ఇది!

పవన్ గెలిచిన తర్వాత జరుగుతున్న అన్ని సందర్భాల్లో అకిరా నందన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. 6.4 హైట్ తో అందరిలో ఎత్తుగా కనిపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 5:46 AM GMT
అకిరా.. అందరినీ మించిపోయే కటౌట్ ఇది!
X

పవన్ కళ్యాణ్.. అకిరా నందన్.. కొద్ది రోజులుగా ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరినీ పక్కపక్కన చూస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. జూనియర్ పవర్ స్టార్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని విజయం సాధించిన తర్వాత నుంచి పవన్ తో పాటు అకిరా నందన్ ఉంటున్నాడు. పిఠాపురంలో పవన్ గెలిచిన తర్వాత ఆయన సతీమణి అన్నాతో కలిసి ఫస్ట్ కనిపించాడు.

ఇంటి బయటకు వచ్చి అభిమానులను తన చిన్నమ్మతో కలిసి అభివాదం చేశాడు. ఆ తర్వాత నాన్నతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా అకిరాను తీసుకెళ్తున్నారు. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని తన సతీసమేతంగా కలిశారు. మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఆ సమయంలో ప్రధానికి చేతులు జోడించి నమస్కరిస్తూ వినయంగా కనిపించాడు అకిరా నందన్.

అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంబరాల వీడియో బయటకొచ్చింది. ఢిల్లీ నుంచి నేరుగా చిరు ఇంటికి వెళ్లారు పవన్, అనా, అకిరా. అక్కడ అందరితో సరదాగా గడుపుతూ కనిపించాడు అకిరా. తన వదిన ఉపాసన, బ్రదర్స్ చరణ్, వరుణ్.. బావ సాయి ధరమ్ తేజ్ తో క్లోజ్ గా ఉంటూ సందడి చేశారు. ఇదే సమయంలో అకిరా కటౌట్ గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.

పవన్ గెలిచిన తర్వాత జరుగుతున్న అన్ని సందర్భాల్లో అకిరా నందన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. 6.4 హైట్ తో అందరిలో ఎత్తుగా కనిపిస్తున్నాడు. మోదీ కూడా అకిరా హైట్ చూసి జోక్ చేసినట్లు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ప్రభాస్(6.2)దే ఎత్తైన కటౌట్ అనుకుంటే.. అంతకు మించి వరుణ్ తేజ్(6.5) ఉంటారు. ఇప్పుడు అకిరా నందన్(6.4) ప్రభాస్ కు మించిన ఎత్తులో ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయం వైరల్ గా మారింది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక.. వరుణ్ తర్వాత భారీ కటౌట్ ఉన్న హీరోగా అకిరా నిలుస్తాడని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎంట్రీ ఎప్పుడు అన్నా అని ప్రశ్నిస్తున్నారు. అయితే అకిరాకు మ్యూజిక్, ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఫ్యాన్స్ మాత్రం హీరోగానే రావాలని కోరుకుంటున్నారు. తల్లి రేణూ దేశాయ్ కూడా అకిరా ఇష్టమే తన ఇష్టమని చెప్పేశారు. మరి జూనియర్ పవర్ స్టార్.. టాలీవుడ్ లోకి ఎప్పుడు.. ఎలా ఎంట్రీ ఇస్తారో వేచి చూడాలి.