అకీరా అమ్మ కూచీ..ఏం చెప్పినా నో చెప్పని సన్!
ఆరకంగా భార్య భర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా మాత్రం తమ బాద్యతల్ని నిర్వర్తిస్తున్నారు.
By: Tupaki Desk | 25 Feb 2024 10:30 AM GMTపవన్ కళ్యాణ్-రేణేదేశాయ్ విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్ ..ఆద్య తల్లి వద్దనే పెరిగి పెద్దైన సంగతి తెలిసిందే. తండ్రిగా పవన్ కళ్యాణ్ నిర్వర్తించాల్సిన బాద్యతలు నిర్వర్తిస్తున్నా? పిల్లలకు అమ్మ ప్రేమను అందించడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. ఆరకంగా భార్య భర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా మాత్రం తమ బాద్యతల్ని నిర్వర్తిస్తున్నారు. మరి అకీరానందన్ అమ్మూకూచీనా..నాన్న కూచీనా అంటే !
అమ్మ కూచీ అనే తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లిదగ్గర ఉన్నందునా? లేక మరో కారణమా? అన్నది తెలియదు గానీ అకీరాకి మాత్రం అమ్మ మాట వేద వాక్కుతో సమానం. చిన్నప్పటి నుంచి అమ్మ ఏం చెబితే అదే చేయడం అలవాటు అట. నో అనే మాట ఇంతవరకూ అకీరా నోట రాలేదుట. మరిన్ని సంగతులు ఆ మామ్ మాటల్లోనే.. అకీరా ఎక్కువ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఉపయోగిస్తుంటాడు. వాటిని తగ్గించి వైర్ కలిగిన ఇయర్‌ఫోన్స్ వాడమని అకీరా- ఆద్యలకు చాలా కాలంగా చెబుతూ వస్తున్నా.
ఎందుకంటే బ్లూటూత్ టెక్నాలజీ చెవులు- బ్రెయిన్‌కు హాని కలిగించే అవకాశం ఉంది. అప్పటినుంచి అకీరా తన అలవాటును మార్చుకుని ఫ్యాన్సీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను పక్కనపెట్టి వైర్‌తో ఉన్న ఇయ ర్‌ఫోన్స్ వాడుతున్నాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏది చెప్పినా చేయడం అకీరాకి చిన్న నాటి నుంచి అలవాటు. ఇలాంటి విషయాల్లో ఆద్య కాస్త మెండికేస్తుంది. కానీ దారిలోకి వస్తుంది.
అలాగని నేను చెప్పిందే చేయాలి అని ఆదేశించను. ఏ నిర్ణయం వెనుకైనా మంచి చెడు రెండు ఉంటాయి. అన్నీ ఆలోచించుకుని చేయండి అని చెబుతా. పెద్ద వాళ్లు అయ్యారు కాబట్టి ఇకపై సొంత నిర్ణయాలు వాటిని స్వాగతించాలి `అని తెలిపారు. ఇక రేణు దేశాయ్ గత ఏడాది టైగర్ నాగేశ్వరరావు తో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో రేణు దేశాయ్ ఎఫెర్ట్ అంతా వృద్ధా ప్రయత్నంగానే మిగిలిపోయింది.