Begin typing your search above and press return to search.

అలియా బుగ్గ‌పై ర‌ణ‌బీర్ ప్రేమ‌తో ఓ ముద్దు!

బాలీవుడ్ లో ఎన్ని జోడీలున్నా వీళ్లు మాత్రం నెట్టింట సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుం టారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 11:55 AM GMT
అలియా బుగ్గ‌పై ర‌ణ‌బీర్ ప్రేమ‌తో ఓ ముద్దు!
X

బాలీవుడ్ జోడీ ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ మ‌ధ్య బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వివాహ బంధంతో ఒక‌టైన ద‌గ్గ‌ర నుంచి నేటి వ‌ర‌కూ ఈ జోడీ ఎప్పుడు క‌నిపించినా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే అనాలి. బాలీవుడ్ లో ఎన్ని జోడీలున్నా వీళ్లు మాత్రం నెట్టింట సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుం టారు. ఆ స్పెష‌ల్ ఉండేలా? ప్లాన్ చేస్తుంటారు.


తాజాగా దివాలీని పుర‌స్క‌రించుకుని జోడీ ఎంతో అందంగా ముస్తాబైన వైనం..ఆ దంప‌తుల మ‌ధ్య ప్రేమానురాగాలు నెటి జనుల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఇదిగో ఇక్క‌డిలా అలియా సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో ఒదిగిపో యింది. ఎరుపు వ‌ర్ణం చీర‌..ర‌విక ధ‌రించి పండ‌గంతా నాలోనే ఉంది అనిపించింది. ఇక భ‌ర్త ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా న‌లుపు రంగు కుర్తాలో క‌నిపిస్తున్నాడు.


ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే! భార్య ప్రేమ‌లో భ‌ర్త మునిగిపోయాడు. వెనుక నుంచి వాటేసుకుని బుగ్గ‌పై ఓ ముద్దు ఇచ్చి క‌పూర్ బోయ్ త‌న మ‌న‌సులో ప్రేమ‌ని చాటి చెప్పిన వైనం అంద‌ర్నీ ఆక‌ర్షిస్తుంది. అలియా ప‌ట్ల రణ‌బీర్ ఆక‌ర్ష‌ణ కొత్తేం కాదు. గ‌తంలోనూ పండుగ సంద‌ర్భాల్లో భార్య‌పై ఇలాగే ప్రేమ‌ని కురిపించాడు. ప్ర‌స్తుతం ఈఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ జోడీని ఉద్దేశించి అభిమానుల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం.


'భార్య‌కి బుగ్గ‌పై ఎంతో ప్రేమ‌తో ఇచ్చిన ముద్దు' అంటూ ఓ నెటి జ‌నుడు పోస్ట్ చేసాడు. ఆద‌ర్శ దంప తులు..అంద‌మైన దంప‌తులు కాల‌కాలం ఇంతే సంతోషం..ప్రేమ‌నురాగాలతో నిండి ఉండాల‌ని కోరుకుంటున్నారు. ఇక ఈజోడీ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు పోటీ పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లో 'యానిమ‌ల్' సినిమాతో ర‌ణ‌బీర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ రెడ్డి తెర‌కెక్కిస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.