ఒకే రోజు ఒకే వేదికపై అక్కినేని బ్రదర్స్ పెళ్లి?
నాగచైతన్య- శోభిత జంట పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. అదే రోజు అఖిల్ - జైనాబ్ పెళ్లి కూడా అదే వెన్యూలో జరుగుతుందని అభిమానులు ఊహిస్తున్నారు.
By: Tupaki Desk | 26 Nov 2024 2:08 PM GMTఅక్కినేని కుటుంబం వెంట వెంటనే రెండు శుభవార్తలు చెప్పింది. అక్కినేని నాగచైతన్య పెళ్లితో పాటు అఖిల్ పెళ్లి గురించి తాజా ప్రకటన అభిమానుల్లో కోలాహాలం పెంచింది. చైతూ తాను వలచిన శోభిత ధూళిపాలను పెళ్లాడుతుండగా, ఇప్పుడు అఖిల్ అక్కినేని జైనాబ్ అనే యువతిని పెళ్లాడేయబోతున్నాడని నాగార్జున ప్రకటించారు. అఖిల్ - జైనాబ్ ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో సునామీగా మారాయి. ఈ అందమైన జంటకు అభిమానులు, ప్రజల నుంచి ఆశీస్సులు అందాయి.
అయితే అన్నదమ్ముల పెళ్లిళ్లు ఒకే రోజు ఒకే వేదికగా జరగనున్నాయి అంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. నాగచైతన్య- శోభిత జంట పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. అదే రోజు అఖిల్ - జైనాబ్ పెళ్లి కూడా అదే వెన్యూలో జరుగుతుందని అభిమానులు ఊహిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకు ఇది డబుల్ ధమాకా ట్రీట్‌గా మారుతుందనడంలో సందేహం లేదు.
అయితే అఖిల్ నిశ్చితార్థం గురించి ప్రకటించిన అక్కినేని కుటుంబం ఇతర విషయాలేవీ వెల్లడించలేదు. అంటే దీనర్థం ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్లు మాత్రమే. అన్నపూర్ణ స్టూడియోస్ లోని పెళ్లి మంటపం సెట్లో చైతన్య- శోభిత పెళ్లి మాత్రమే జరుగుతుంది. అఖిల్ - జైనాబ్ రవుడ్జీ పెళ్లి వెన్యూ గురించి, పెళ్లి తేదీ గురించి ఇంకా అక్కినేని కుటుంబం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే చిత్రంలో నటిస్తుండగా, అఖిల్ వరుసగా రెండు చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసారు.