అక్కినేని ఫ్యామిలీ నుంచి కోటి విరాళం!
ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున విరళాలు అందుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 Sep 2024 10:00 AM GMTఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున విరళాలు అందుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కినేని ఫ్యామిలీ అండ్ గ్రూప్ కంపెనీస్ బాధితుల కోసం కోటి విరాళం ప్రకటించింది. విశాఖపట్టణంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్ తో కలిసి అక్కినేని ఫ్యామిలీ ఈ విరాళం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ సహాయ నిధికి 50 లక్షలు-ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి 50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
`ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయి. బాధితులు వీలైనం త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాం` అని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఆపత్కాలంలో అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. ఏఎన్నార్ కాలం నుంచే ఎన్నో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
తనయుడు నాగార్జున తండ్రి వారసత్వాన్ని నటుడిగానే కాకుండా, ఛారిటీల ద్వారానూ కొనసాగిస్తున్నారు. అక్కినేని ఇంట కోడలు అమల సామాజిక కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొంటారు అన్న సంగతి తెలిసిందే. నాగార్జున బయటకు చెప్పని ఎన్నో సహాయాలు చేస్తుంటారు. చేసిన సహాయం చెప్పుకోవడం ఆయనకు ఇష్టం ఉండదని పలు సందర్భాల్లో అన్నారు.
తాజా పరిస్థితులపై అక్కినేని ఫ్యామిలీ- అలుఫ్లోరైడ్ లిమిటెడ్ సంయుక్తంగా విరాళం ఇవ్వడంపై అభిమా నులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా నాగార్జున అండ్ కో మరిన్ని విజయాలు అందుకోవాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.