అక్కినేని ఫ్యాన్స్.. ఆగలేక.. అడగలేక..!
అక్కినేని ఫ్యాన్స్ మాత్రం కొన్నాళ్లు అప్డేట్స్ కోసం అడిగి అడిగి ఇప్పుడు ఆగకుండా ఉండలేక అడగలేక సైలెంట్ అయిపోయారు. నాగ చైతన్య తండేల్ మీదే ప్రస్తుతం అక్కినేని ఫ్యాన్స్ గురి ఉంది.
By: Tupaki Desk | 28 Jan 2025 12:30 AM GMTఅక్కినేని హీరోల్లో నాగ చైతన్య ఒక్కడే సినిమా వెంట సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. కింగ్ నాగార్జున కూడా తన ఇమేజ్ కి తగిన కథల కోసం వెయిట్ చేస్తూ ఉంటే యువ హీరో చినబాబు అఖిల్ కూడా సినిమాకు ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుంటుంటే అక్కినేని ఫ్యాన్స్ అప్ సెట్ అవుతున్నారు. ఏజెంట్ వచ్చి రెండేళ్లు దాటింది అఖిల్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇప్పటివరకు రాలేదు. నాగ చైతన్య మాత్రం తండేల్ మొదలు పెట్టాడు పూర్తి చేసి రిలీజ్ కు రెడీ అయ్యాడు.
మరోపక్క నాగార్జున కూడా సోలో సినిమాకు కథలు దొరకట్లేదు కానీ వేరే హీరోల సినిమాల్లో మాత్రం భాగం అవుతున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ, ధనుష్ తో కుబేర ఈ రెండు సినిమాలతో నాగార్జున కోలీవుడ్ ఆడియన్స్ ని అలరించనున్నాడు. రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఊపిరి సినిమా టైం లోనే కోలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరైన నాగార్జున రాబోయే రెండు సినిమాలతో మరింత ఆకట్టుకోవాలని చూస్తున్నాడు.
ఇక అఖిల్ విషయానికి వస్తే మాత్రం సినిమాల విషయంలో క్లారిటీ లేకపోవడం కొనసాగుతున్నట్టే ఉంది. ఈమధ్యనే పర్సనల్ లైఫ్ లో మరో స్టెప్ వేశాడు అఖిల్. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చాడు. మరి నెక్స్ట్ సినిమా పెళ్లి తర్వాత మొదలు పెడతాడా ఏంటి అని అందరు అనుకుంటున్నారు. ఐతే అఖిల్ ఈసారి వస్తే భారీ సినిమాతోనే రావాలని చూస్తున్నాడు.
అఖిల్ తో హోంబలే ప్రొడక్షన్ ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తుందని తెలిసిందే. ఐతే సినిమా అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కాస్త ఖుషి అవుతారని తెలిసినా ఎందుకు లేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం కొన్నాళ్లు అప్డేట్స్ కోసం అడిగి అడిగి ఇప్పుడు ఆగకుండా ఉండలేక అడగలేక సైలెంట్ అయిపోయారు. నాగ చైతన్య తండేల్ మీదే ప్రస్తుతం అక్కినేని ఫ్యాన్స్ గురి ఉంది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో అన్ని కలిసి వస్తున్నాయి. మరి సినిమా ఏం చేస్తుంది అన్నది చూడాలి. నాగార్జున, అఖిల్ చేస్తున్న లేట్ ని బ్యాలెన్స్ చేసేందుకు నాగ చైతన్య కష్టపడుతున్నాడు. తండేల్ తో పెద్ద టార్గెట్ పెట్టుకున్న యువ సామ్రాట్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ హిట్ కొట్టేలానే ఉన్నాడు.