మరో సినిమాలో కింగ్ స్పెషల్ రోల్?
ఇండియన్ సినీ చరిత్రలోనే గొప్ప ఎంటర్టైనింగ్ ఫ్రాంచైజ్ గా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన మున్నాభాయ్ కు పేరుంది.
By: Tupaki Desk | 10 Feb 2025 7:18 AM GMTఇండియన్ సినీ చరిత్రలోనే గొప్ప ఎంటర్టైనింగ్ ఫ్రాంచైజ్ గా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన మున్నాభాయ్ కు పేరుంది. ఈ సిరీస్ సినిమాలు సంజయ్ దత్ కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పాయి. మున్నాభాయ్ సినిమా మామూలు సెన్సేషన్ కాదు. ఆ తర్వాత లగే రహో మున్నాభాయ్ తీస్తే అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది.
ఈ రెండు సినిమాలకు సీక్వెల్ గా మున్నాభాయ్3 తీయాలని హిరానీ ఎప్పటినుంచో అనుకుంటుంటే దానికి ఇప్పుడు టైమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పటికే రాజ్ కుమార్ హిరానీ మున్నాభాయ్3 కు స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని తెలుస్తోంది. మున్నాభాయ్ ఛలే అమెరికా అనే టైటిల్ తో ఈ సినిమాను అప్పట్లోనే హిరానీ అనౌన్స్ చేశాడు.
మొదటి రెండు సినిమాల కంటే ఈ సినిమా చాలా మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాపై తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
బాలీవుడ్ లో ప్రస్తుతం హిరానీకి మంచి క్రేజ్ ఉంది. ఆయనతో సినిమా చేయడానికి ఏ స్టార్ హీరో అయినా ఓకే అంటాడు. అలాంటి టైమ్ లో సడెన్ గా హిరానీ మున్నాభాయ్3 అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే, ఆ సినిమాలో నాగార్జున నటిస్తున్నాడని వార్తలు రావడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది.
బాలీవుడ్ లో మంచి హిట్లుగా నిలిచిన మున్నా భాయ్, లగే రహో మున్నా భాయ్ సినిమాలను తెలుగులో చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే ధనుష్ తో కలిసి కుబేర లో ప్రత్యేక పాత్ర చేస్తున్న నాగార్జున, రజినీకాంత్ కూలీలో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు మున్నాభాయ్3 లో కూడా నాగార్జున స్పెషల్ రోల్ చేయనుండటం విశేషంగా మారింది.