కింగ్ ఆలోచన వెనక రీజన్ ఏంటి..?
ఆ సినిమా సక్సెస్ మీట్ లో ఇక మీదట ప్రతి సంక్రాంతికి తన నుంచి ఫ్యాన్స్ ని అలరించేందుకు ఒక సినిమా వస్తుందని అన్నారు నాగర్జున.
By: Tupaki Desk | 24 Dec 2024 4:14 AM GMTకింగ్ నాగార్జున ఈమధ్య తన సినిమాల వేగాన్ని తగ్గించారు. ఒకప్పుడు ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమా లైన్ లో పెడుతూ వచ్చే నాగార్జున సినిమా సినిమాకు ఈమధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. దాని వెనక రీజన్ నాగార్జున కోరినట్టుగా కథలు దగ్గరకు రాకపోవడమే అని తెలుస్తుంది. ఈ ఇయర్ మొదట్లో నా సామిరంగ అంటూ సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. ఆ సినిమా సక్సెస్ మీట్ లో ఇక మీదట ప్రతి సంక్రాంతికి తన నుంచి ఫ్యాన్స్ ని అలరించేందుకు ఒక సినిమా వస్తుందని అన్నారు నాగర్జున.
ఐతే తాను అనుకున్నా కూడా సరైన కథ దొరక్క వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అసలైతే నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నికి మరో ఛాన్స్ ఇస్తాడన్న టాక్ ఉంది. నాగార్జున కూడా ఒక హిట్ ఇచ్చాడు కాబట్టి అతన్ని నమ్మొచ్చని అనుకున్నాడట కానీ ఎందుకో నాగ్ మళ్లీ వెనక్కి తగ్గుతున్నాడని తెలుస్తుంది. విజయ్ బిన్ని సొంత కథతో నాగ్ తో సినిమా చేయాలని వస్తేనే నా సామిరంగ రీమేక్ కథ ఇచ్చారట.
ఆ సినిమా సక్సెస్ కొట్టాక కూడా విజయ్ కథ గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. మరోపక్క నాగార్జున వేరే కథలు వింటున్నారు కానీ అవేవి అసలు అవుట్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలతో యూత్ ని ఎట్రాక్ట్ చేయాలని ప్రయత్నించిన నాగార్జున ఆ తర్వాత రూట్ మార్చి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
నాగార్జున ప్రస్తుతం సోలో సినిమాల కన్నా ఇతర హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో నాగార్జున ధనుష్ కుబేర సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాతో పాటుగా రజినీకాంత్ కూలీ సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకే తన సోలో సినిమా గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.
నాగార్జున స్టార్ డం, కెపాసిటీకి తగిన కథ రావట్లేదని అంటున్నారు. నాగ్ నెక్స్ట్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఆ సినిమా ఏదవుతుందో చూడాలి. ఐతే ఈసారి కూడా హిట్ టార్గెట్ మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే నాగార్జున ఈ లేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నాగ్ కొత్త సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే వారిని ఏమాత్రం నిరాశ చెందకుండా త్వరలోనే న్యూ ఫిల్మ్ అప్డేట్ తో కింగ్ సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.