Begin typing your search above and press return to search.

ఏఎన్నార్ ఆ కళ్లద్దాలు చాలా ఫేమస్..!

ఐతే ఆ సినిమాలో అప్పటి స్టార్ యాక్టర్ అయిన కన్నాంబ కూడా నటించారు.

By:  Tupaki Desk   |   20 Sep 2024 2:36 PM GMT
ఏఎన్నార్ ఆ కళ్లద్దాలు చాలా ఫేమస్..!
X

నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తా ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట.. అఫ్కోర్స్ ఆయన అలానే యువతని పిచ్చెక్కించే ట్రెండ్ సృష్టించారు. ఐతే అంతకుముందు చాలా సందర్భాల్లో చాలామంది ఈ ట్రెండ్ సెట్ చేసే అంశాలు చేశారు. అలాంటి వారిలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమ రెండు కళ్లుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్ లలో అక్కినేని చేసిన సేవలు గురించి ఎంత చెప్పినా తక్కువే.

అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ.. ఆయన గురించి కొన్ని అంశాలు గుర్తు చేసుకుందాం.. అప్పట్లో సినిమాల్లో అడుగు పెడితే తన పాటలు కూడా తానే పాడుకునే ప్రతిభ ఉండేది. అలా ముగ్గురు మరాఠీలు సినిమా రావడంతో ఆ సినిమాను తెలుగులో ఏఎన్నార్ టీజీ కమలా దేవి తో తీశారు. అందులో చల్.. చలో వయ్యారీ షికారీ పాట ఏఎన్నార్, టీజీ కుమారి స్వయంగా ఆలపించారు.

ఐతే ఆ సినిమాలో అప్పటి స్టార్ యాక్టర్ అయిన కన్నాంబ కూడా నటించారు. ఆ టైం లో షూటింగ్ బ్రేక్ లో టిఫిన్, కాఫీలు రావడంతో తనకు ఇస్తారని ఏఎన్నార్ అనుకున్నారు. కానీ వారికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదట. ఆ టైంలో ఏఎన్నార్ కు కోపం వచ్చి తనకున్న ర్యాలీ సైకిల్ తో కొంత దూరం వెళ్లి తనకు టీజీ కమలాదేవికి కేకులు తెచ్చారట. అది చూసిన ప్రొడక్షన్ వాళ్లు కుర్రాడికి పౌరుషం ఎక్కువే అని అనుకున్నారట.

ఇలా తన ఆత్మాభిమానాన్ని చాటుకున్న సందర్భాలు ఏఎన్నార్ కెరీర్ లో చాలా ఉన్నాయి. ఇక అప్పటివరకు పౌరాణిక పాత్రలు చేసిన ఆయన జానపద సినిమాలు చేయగలడా అనుకున్న వారికి 1950 లో సంసారం సినిమాలో వేణు పాత్రలో పట్నం కుర్రాడిగా మెప్పించారు. ఆ టైం లో కల నిజమాయేగా కోరిక తీరేగా పాటలో అందంగా కనిపించాలని ఏఎన్నార్ మద్రాసు మౌంట్ రోడ్డులోని మయో ఆప్టికల్స్ లో గుండ్రని అద్దాలను ముఖానికి సరిపడేవి తెచ్చుకుని పాటలో ధరించారట. అలా ఆ సినిమాలోని ఆ పాట సూపర్ హిట్ కాగా ఆ కళ్లద్దాలకు సూపర్ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. మయో ఆప్టికల్స్ లో ఏకంగా 5 వేల దాకా అలాంటి కళ్లద్దాలు అమ్ముడయ్యాయని ఆ షాప్ యజమానులు అక్కినేనికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారని తెలుస్తుంది. అంతేకాదు అక్కినేని తనకు కావాల్సిన కళ్లదాలను చాలా కాలం పాటు అక్కడ నుంచే తెప్పించుకున్నారట.