Begin typing your search above and press return to search.

సంక్రాంతి సెంటిమెంట్ కోసం నాగ్‌ ప్లాన్స్‌!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో చాలా మంది సంక్రాంతికి వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నారు

By:  Tupaki Desk   |   21 Aug 2023 10:00 AM GMT
సంక్రాంతి సెంటిమెంట్ కోసం నాగ్‌ ప్లాన్స్‌!
X

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో చాలా మంది సంక్రాంతికి వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. వారిలో నాగార్జున కూడా ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా సంక్రాంతికి వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశ పరిచినా గత ఏడాది సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమా పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది.

నాగార్జున సంక్రాంతికి వస్తే సక్సెస్‌ గ్యారెంటీ అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు చివరకు నాగ్ కూడా అదే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి నాగార్జున సంక్రాంతికి రావాలని భావిస్తున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటి వరకు నాగార్జున కొత్త సినిమా ప్రారంభం కాలేదు. మరి సంక్రాంతికి రావడం సాధ్యమా అనే అనుమానాలు రావచ్చు.

అసలు విషయం ఏంటంటే ఒక మలయాళ సినిమాను నాగార్జున రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా పలువురు దర్శకులు స్క్రిప్ట్‌ విషయంలో సంతృప్తి పరచలేదట. దాంతో వెయిట్‌ చేసి చేసి చివరకు విజయ్‌ బిన్ని కి దర్శకత్వం ఛాన్స్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.

సినిమా రీమేక్ అవ్వడంతో పాటు స్క్రీన్‌ ప్లే ఇతర విషయాల కారణంగా మేకింగ్ కు చాలా తక్కువ సమయం పడుతుందట. అందుకే సినిమా ను సంక్రాంతికే విడుదల చేయాలని నిర్మాత చిట్టూరి శ్రీను భావిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఈ సినిమా అధికారిక ప్రకటన నాగార్జున బర్త్‌ డే సందర్భంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి.

సంక్రాంతి సెంటిమెంట్ కోసం తొందర పడుతున్న నాగార్జున ఈసారి అయినా ఒక కమర్షియల్‌ హిట్ తో వస్తాడా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నారు. అందుకే నాగార్జున పైనే ఆశలు అన్నీ అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.