రంగలో మాస్ మాత్రమే కాదు..ఆయన లో క్లాస్ ఉందే!
కొన్ని పోస్టర్స్ లో నాగ్ ని ఎంత మాస్ గా చూపించారో? మరికొన్ని పోస్టర్స్ లో కొంత స్టైలిష నెస్ హైలైట్ అవుతుంది
By: Tupaki Desk | 1 Sep 2023 8:23 AM GMTకింగ్ నాగార్జున 99వ చిత్రం 'నా సామిరంగ'కి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన కింగ్ మాస్ లుక్ తోనే కంటెంట్ ఎలా ఉండబోతుంది? అన్న ఓ అంచనా మొదలైంది. నాగార్జునని ఇలాంటి మాస్ లుక్ లో చూసి చాలా కాలమవుతుంది. ట్రెండ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం రావడంతో నాగార్జున కూడా రొటీన్ కి భిన్నమైన సినిమాల్లోకి వెళ్లిపోయారు.
ఈ కోవలో ఎక్కువగా డిఫరెంట్ కంటెంట్ కే ప్రాధాన్యత ఇచ్చారు. మధ్య మధ్య లో 'బంగార్రాజు' లాంటి సినిమాలో మాస్ పాత్రలు పోషించినా! అక్కినేని అభిమానులకు సరిపడ్డ మాస్ కిక్ కాదది. కింగ్ నుంచి అంతకు మించి ఎక్సపక్టేషన్స్ ఉంటాయి. ఆ రకంగా కొన్ని రకాల అంచనాల్ని కింగ్ అందుకోలే కపోయారు. అయితే తాజాగా 'నా సామిరంగ' లో కొత్త దనంతో పాటు మాస్ కోణంలో సినిమా సాగుతుందని చెప్పొచ్చు. రెండింటిని మిక్స్ చేసి దర్శకుడు ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
కొన్ని పోస్టర్స్ లో నాగ్ ని ఎంత మాస్ గా చూపించారో? మరికొన్ని పోస్టర్స్ లో కొంత స్టైలిష నెస్ హైలైట్ అవుతుంది. ఇదిగో ఈ పోస్టర్ లో నాగ్ లో మాస్ కోణాన్ని చెబుతూనే..అతనిలో క్లాస్ హీరోని చూపించారు. ఎర్ర చొక్కా వేసి ముందు బటన్ విప్పేసినంత మాత్రాన మాస్ కాడు. నాగార్జున క్లాస్ గా ఓ స్మైల్ ఇస్తే క్లాస్ అలా పడి ఉంటారు? అనేలా ఇది కనిపిస్తుంది. ఇందులో నాగార్జున గుబురు హెయిర్ స్టైల్..కోర మీసాలు..గెడ్డం అన్ని కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.
'ది ఘోస్ట్' తర్వాత నాగార్జున నుంచి కొత్త సినిమా ప్రకటన రావడానికి ఎంత సమయం పట్టిందో తెలిసిందే. హిట్ కంటెంట్ తోనే రావాలని ఇంత సమయం తీసుకున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ తో ఓ సినిమా చేయాల్సి ఉండగా...ఆ ప్రాజెక్ట్ పై మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో! ఉందా? లేదా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇంతలో 'నా సామిరంగ' అంటూ కింగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.